బీస్ట్ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Deelip Kumar ) తన తదుపరి చిత్రాన్ని రజినీకాంత్ ( Rajinikanth ) తో జైలర్ సినిమా( Jailer Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
రజినీకాంత్ సుమారు మూడు సంవత్సరాల తర్వాత జైలర్ సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకున్నారు.
ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయిన సందర్భంలో ఈయన పలు ఆలయాలను సందర్శిస్తున్నారు.
ఇక ఈ సినిమా విడుదలకు ముందు రోజు ఈయన హిమాలయాలకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన బీస్ట్ తర్వాత జైలర్ సినిమాని ప్రకటించిన తర్వాత చాలామంది రజనీకాంత్ కు ఈ సినిమా చేయొద్దని కూడా సలహాలు ఇచ్చారట.రజినీకాంత్ కథపై నమ్మకంతో ఈ సినిమా చేయడానికి కమిట్ అయ్యారని తెలుస్తుంది.అయితే తాజాగా రజనీకాంత్ రిషికేషన్లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమానికి వెళ్లారు.
అక్కడికి వెళ్లినటువంటి ఈయన మొదటిసారి జైలర్ సినిమా రిజల్ట్ గురించి స్పందించారు.
ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఒత్తిడి ఉండేది కొన్ని సార్లు నేను కూడా చాలా ఒత్తిడికి గురయ్యానని రజనీకాంత్ తెలిపారు.ఒకానొక సమయంలో ఈ సినిమా హిట్ అవుతుందా అన్న సందేహం నాకు కూడా వచ్చింది అంటూ ఈ సందర్భంగా రజనీకాంత్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ సమయంలో నాకు స్వామీజీ గారు ఒక మాట చెప్పారు ఈ సినిమా గురించి ఎలాంటి కంగారు అవసరంలేదని తప్పకుండా హిట్ అవుతుందని చెప్పడంతో స్వామి గారు చెప్పిన తర్వాత ఈ సినిమా గురించి ఆలోచించడం వృధా అని భావించాను అనుకున్న విధంగానే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది అంటూ ఈ సందర్భంగా రజినీకాంత్ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy