రజినీకాంత్ నుంచి అభిమానులు ఊహించని సమాధానం

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ వైపు అన్నాత్తై సినిమా షూటింగ్ కోసం చేస్తున్న సమయంలో సెట్ లో ఏకంగా ఎనిమిది మందికి కరోనా రావడంతో సడెన్ గా వాయిదా వేసేశారు.

ఇంతలో రజినీకాంత్ హైబీపీతో ఆరోగ్యం దెబ్బతినడంతో హాస్పిటల్ లో చేరారు.

ఈ నేపధ్యంలో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా రజిని అభిమానులు భయపడ్డారు.తమిళనాడులో అయితే రెండు రోజుల పాటు రజినీకాంత్ అభిమానుల టెన్షన్ కి అవధులు లేవు.

హాస్పిటల్ లో చేరిన రజినికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు అతనికి కరోనా సోకలేదని నిర్ధారించిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నారు.తరువాత హైబీపీ కారణంగానే ఆయన ఆరోగ్యం క్షీణించింది అని డాక్టర్లు తేల్చి చెప్పేశారు.

త్వరగా కోలుకుంటున్నారని చెప్పిన తర్వాత అందరూ ఊపిరిపీల్చుకున్నారు.రెండు రోజుల క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్ ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్ళిపోయారు.

Advertisement

కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.దీంతో ఇంటివద్దనే రజిని ఉంటున్నారు.

అయితే ఈ నెల ఆరంభంలో తన రాజకీయ అరంగేట్రం గురించి రజిని క్లారిటీ ఇచ్చారు.కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలిపారు.

డిసెంబర్ నెల ఆఖరున రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పారు.అభిమానులతో సమావేశం కూడా నిర్వహించారు.

అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో రాజకీయ పార్టీని ఎనౌన్స్ చేయాలనే ఆలోచనని విరమించుకున్నారు.దీనిపై అభిమానులకి క్లారిటీ ఇస్తూ ట్విట్టర్ లో ఒక ప్రకటన చేశారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?

అనారోగ్య కారణాలతో రాజకీయ పార్టీ పెట్టాలనే నిర్ణయాన్ని కొంత కాలం వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు.త్వరలో మళ్ళీ దానిపై ప్రకటన చేస్తానని తెలిపారు.

Advertisement

ఏప్రిల్ లో ఎన్నికలు జరబోతున్న నేపధ్యంలో తమిళ రాజకీయాలలో రజినీకాంత్ కీలకంగా మారుతారని అందరూ అనుకున్నారు.అయితే ఇప్పుడు ఒక్కసారిగా పార్టీ ఆలోచనని సూపర్ స్టార్ వెనక్కి తీసుకోవడం మరో సారి చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తలు