తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ ఇంకా కొత్త హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తలైవా రజనీకాంత్( Rajini kanth ) క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గదు.అలాగే ఆయన స్టార్ డమ్ కూడా తగ్గదు ఏ హీరో వచ్చిన గాని ఆయన స్టైల్ గాని,ఆయన గ్రేస్ ని గానీ మ్యాచ్ చేసే హీరో ఇప్పటివరకు తమిళ్ ఇండస్ట్రీ( Kollywood )లో లేడు అనే చెప్పాలి.

ప్రస్తుతం ఆయన సినిమాలు చేయడానికి ఆయన బాడీ సహకరించినప్పటికీ ఆయన ఫ్యాన్స్ ఆయన మీద పెట్టుకున్న ఒక నమ్మకాన్ని మమ్ము చేయకూడదు అనే ఉద్దేశంతో ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయాలనే ఉద్దేశ్యం తో ఆయన ఇంకా సినిమాలు చేస్తున్నారు.అది కూడా మామూలు సినిమాలు కాదు తన ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ లను ఎంచుకొని అందులోనే విజయం సాధించడానికి చాలారకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.ఇక రీసెంట్ గా వచ్చిన జైలర్ సినిమా చూస్తే మనకు అర్థం అవుతుంది…

ఆయన క్రేజ్ గాని,ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా గానీ ఏమాత్రం తగ్గలేదు అని మరోసారి ప్రూవ్ చేసాడు.ఇక ఈ సినిమా తమిల్లోనే కాకుండా తెలుగు లో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.రజినీకాంత్ నటనకి జనాలందరూ ఫిదా అయిపోయారు.ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఎలివేషన్స్ కి థియేటర్లో ఆయన అభిమానులకి పూనకాలు వచ్చాయని చెప్పాలి.అయితే ఇప్పటికి కూడా ఆయన జైలర్ సినిమాతో( Jailer ) తమిళ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ కొట్టారు అయితే అది చూసిన కొంతమంది హీరోల ఫ్యాన్స్ ఈ సినిమాలో రజనీకాంత్ ఏం చేయకపోయినా ఆయనకు ఇండస్ట్రీ హిట్ అనేది ఎలా వచ్చింది.సినిమా మొత్తం జస్ట్ అలా నడుస్తూ ఉన్నాడంటే దానికే ఆయన సినిమా అన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తూ ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసింది అంటే ఆయనకు ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
తమిళ్ ఇండస్ట్రీలో ఏ హీరో వచ్చిన ఆయన తర్వాతే అని అక్కడున్న సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…
.