యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఇండస్ట్రీలో ఎంతోమంది సన్నిహితులు ఉన్నా దర్శకధీరుడు రాజమౌళి, రాజీవ్ కనకాల అత్యంత సన్నిహితులు అనే సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ షూటింగ్ సమయంలో చేసే అల్లరి గురించి ఇప్పటికే పలువురు నటులు ఇంటర్వ్యూల్లో చెప్పగా తాజాగా రాజీవ్ కనకాల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తనకు స్టూడెంట్ నంబర్ 1 సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ తో పరిచయం ఏర్పడిందని రాజీవ్ కనకాల అన్నారు.
అయితే తారక్ మొదటి సినిమా నిన్ను చూడాలని డబ్బింగ్ కోసం తనను పిలిచారని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ కు తన వాయిస్ సరిపోదని భావించి తాను వాయిస్ టెస్ట్ ఇచ్చి వెనక్కు వచ్చానని రాజీవ్ కనకాల చెప్పారు.స్టూడెంట్ నంబర్ 1 సినిమాను ఆడుతూ పాడుతూ చేశామని రాజీవ్ కనకాల తెలిపారు.
ఎన్టీఆర్ ఒకరోజు కాల్ చేసి అర్జంట్ గా కిందికి రమ్మని చెప్పగా తాను వెళ్లానని రాజీవ్ కనకాల అన్నారు.

శ్రీనగర్ కాలనీ నుంచి జూబ్లీహిల్స్ కు అని చెప్పి తనను ఎన్టీఆర్ షూటింగ్ కు తీసుకెళ్లారని రాజీవ్ చెప్పుకొచ్చారు.షూటింగ్ కు వెళ్లిన తర్వాత రాజమౌళి షూటింగ్ లేకపోతే వేరే పని చూసుకోలేవా పక్కన కుర్రాడిని పని చేసుకోనివ్వకుండా చేస్తున్నావని తారక్ ను చూపిస్తూ రాజమౌళి తిట్టాడని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.ఆ తర్వాత స్టూడెంట్ నంబర్ 1 పెద్ద హిట్ అయిందని రాజీవ్ కనకాల తెలిపారు.
స్టూడెంట్ నంబర్ 1 రెమ్యునరేషన్ తో వ్యూ ఫైండర్ ను రాజమౌళిని కొనుగోలు చేశారని రాజీవ్ కనకాల అన్నారు.ఆ తర్వాత మరో సందర్భంలో తాను, ఎన్టీఆర్, జక్కన్నను పిలుచుకుని స్నూకర్ ఆడటం కోసం ట్యాంక్ బండ్ దగ్గరకు తీసుకెళ్లారని అప్పుడు రాజమౌళికి గతంలో తాను తిట్లు తిన్న రోజు ఏం జరిగిందో అర్థమైందని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.