హైకోర్టు సంచలన తీర్పు... పెళ్లయిన వ్యక్తితో ప్రియురాలు కలిసి ఉండేందుకు ఓకే

ఇండియన్‌ చట్ట ప్రకారం పెళ్లి అయిన మగాడు మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం నేరం.

మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత రెండవ పెళ్లికి మాత్రమే చట్టం ఒప్పుకుంటుంది.

విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే అయిదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది.అయితే రాజస్థాన్‌ హైకోర్టు మాత్రం మొదటి సారి వినూత్నమైన తీర్పును ఇచ్చింది.

ఇండియన్‌ చట్టానికి విభిన్నంగా తీర్పు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

రాజస్థాన్‌కు చెందిన మొయినుద్దీన్‌ అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం పెళ్లి అయ్యింది, పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఆయన జీవితం సాఫీగా సంతోషంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో 26 ఏళ్ల రూపాల్‌ సోనీ ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

మొయినుద్దీన్‌ను రూపాల్‌ ప్రేమించింది.ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

అతడికి పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నా కూడా ఆమె మాత్రం పెళ్లికి ఆసక్తి చూపించింది.అతడిని తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోవద్దని భావించింది.

అలాంటి సమయంలో కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు మొయినుద్దీన్‌ ప్రయత్నించాడు.కాని కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఒప్పుకోలేదు.

మొదటి భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాలని భావించాడు.అయితే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆమెను కూడా భార్యగానే ఉంచుకోవాలనుకున్నాడు.మొదటి భార్యను ఉంచుకునే రెండవ భార్యగా రూపాల్‌ను వివాహం చేసుకున్నాడు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

రూపాల్‌ వివాహం విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెను మొయినుద్దీన్‌కు దూరంగా ఉంచారు.ఆమెను గృహనిర్బందం చేశారు.

Advertisement

అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను కుటుంబ సభ్యులు విడుదల చేశారు.ఆ తర్వాత రాజస్థాన్‌ హై కోర్టుకు మొయినుద్దీన్‌ వెళ్లాడు.

తాను ఇద్దరితో సంసారం చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పాడు.అందుకు సంబంధించిన పూర్తి వివరాలను, ఎదురైన పరిస్థితులను వెళ్లడించాడు.దాంతో కోర్టు కూడా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండవ భార్య రూపాల్‌తో ఉండేందుకు మొయినుద్దీన్‌కు అనుమతించింది.

రూపాల్‌ సోనీ తల్లిదండ్రులకు మొయినుద్దీన్‌ను అల్లుడిగా అంగీకరించాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది.కోర్టు తీర్పుపై కొందరు అసహనం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు మాత్రం మంచి తీర్పు అంటూ అభినందిస్తున్నారు.

తాజా వార్తలు