మహేష్ బాబు కోసం భారీ స్కెచ్.. ప్రపంచమే ఆశ్చర్యపడే ప్రమోషన్స్ షురూ

ఒక సినిమా విజయవంతం సాధించి అవ్వాలంటే దానికి ఎంతో శ్రమించాలి.ఆకాశంలో నడవాలి అంటే భూమిపై ఉండి నడుస్తా అంటే కుదరదు కదా.

 Rajamouli Superb Action Plan For Mahesh Babu Details, Rajamouli , Mahesh Babu, R-TeluguStop.com

ఆకాశానికి సరిపడా అక్కడ వరకు చేరే నిచ్చెన వేసుకోవాలి.అందుకే సినిమా అనౌన్స్ చేస్తున్న ప్రతిసారి రాజమౌళి( Rajamouli ) తనదైన శైలిలో దాని ప్రమోషన్ చేసుకుంటూ వస్తాడు.

దానికోసం కూడా చాలా కష్టపడి ఆలోచన చేసి ఒక పద్ధతిగా దాన్ని ప్రేక్షకులలో వారి మనసులలో ఇంజక్ట్ చేస్తారు.అదే రాజమౌళి స్పెషాలిటీ.ఉదాహరణకు బాహుబలి సినిమా( Baahubali ) తీసుకోండి.ఈ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో విజయాన్ని అందుకుంది అంటే దాని వెనుక రాజమౌళి కృషి, పట్టుదలతో పాటు అనుసరించిన ప్రమోషన్స్ కూడా ఒక కారణం.

Telugu Baahubali, Rajamouli, Mahesh Babu, Pan, Rajamoulimahesh, Tollywood-Movie

బాహుబలి సినిమా కోసం ప్రతి పాత్రను పరిచయం చేస్తూ మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని సృష్టించాడు.ఆ తర్వాత ఆర్ఆర్ఆర్( RRR ) సినిమా కోసం అయితే ప్రెస్ మీట్ పెట్టి మరి కథను అనౌన్స్ చేశాడు.ఇలా సినిమా ప్రకటించగానే కథను ముందే స్టేజిపై చెప్పే దర్శకులు ఎంతమంది ఉంటారు.ఖచ్చితంగా రాజమౌళికి మాత్రమే ఇది సాధ్యమైంది.ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోలను పెట్టుకొని సినిమా తీస్తున్నాడు అంటే అంచనాలు భారీగా ఉంటాయి.ఆ అంచనాలను అందుకోలేకపోతే ఎక్కడైనా బోల్తా కొడతామనే భయం తో ముందుగానే రాజమౌళి కథను లీక్ చేసి తమ స్టామినా ఇంతే అని చెప్పే ప్రయత్నం చేశాడు.

దాంతో ప్రేక్షకులలో అంచనాలు తగ్గుతాయి అని అతడు వేసిన ప్లాన్ కూడా బాగా సక్సెస్ అయ్యింది.

Telugu Baahubali, Rajamouli, Mahesh Babu, Pan, Rajamoulimahesh, Tollywood-Movie

ఇక ఇప్పుడు మహేష్ బాబు తో( Mahesh Babu ) మరో పాన్ ఇండియా సినిమా చేయడానికి రాజమౌళి రంగం సిద్ధం చేసుకున్నాడు.దీనికోసం ఇప్పుడు ఒక ప్రమోషన్ వీడియో కూడా మొదలు పెట్టబోతున్నాడట.దీనికి సంబంధించిన వివరాలను అతి త్వరలో తెలియ చేయబోతున్నారు.

సినిమా గురించి చెప్పడానికి ఈ వీడియో పనికి వస్తుందట.మరి అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతుంది కాబట్టి దానికి సంబంధించిన మార్కెట్ ని కూడా సృష్టించుకోవాలని రాజమౌళి ఇప్పటి నుంచే ప్లాన్స్ వేస్తున్నాడు.

ట్రేడ్ పండితులకు ఒక అంచనా క్రియేట్ చేయడం కోసమే ఈ వీడియో పనికి వస్తుందట.దీనికోసం సన్నాహాలు జరుగుతున్నాయి.

ఏదేమైనా రాజమౌళి బుర్ర మామూలుగా పనిచేయదు కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube