తెలుగు సినీ పరిశ్రమను టాప్ లో నిలబెట్టిన ఘనత రాజమౌళి కే సొంతం.ఈయన మన తెలుగు సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించేలా చేశాడు.
బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ సినీ పరిశ్రమ గురించి బాలీవుడ్ సైతం మాట్లాడుకునేలా చేశాడు.టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్న జక్కన్న ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా చూడలేదు.
ఈయన 99 శాతం సక్సెస్ రేట్ ను కలిగి ఉన్నాడు.ప్రసెంట్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎందరో లెజెండరీ డైరెక్టర్లలో రాజమౌళికి తప్ప మరే డైరెక్టర్ కు ఇంత సక్సెస్ రేట్ లేదు.
ఆ రికార్డ్ ను కొల్లగొట్టడం ఎవ్వరికి సాధ్యం కాదు.మగధీర, బాహుబలి లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజమౌళి ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.

ప్రెసెంట్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.అందుకే ప్రెసెంట్ చిత్ర యూనిట్ మొత్తం ప్రొమోషన్స్ లో బిజీగా ఉంది.నిన్న రాత్రి ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముంబైలో జరిగింది.

ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు స్టేజ్ మీద కనిపించాడు.నిన్న బిగ్ బాస్ 5 ఫినాలే ఎపిసోడ్ జరిగింది.ఈ భారీ వేడుకకు ఆర్ ఆర్ ఆర్ సినిమా తరపు నుండి రాజమౌళి హాజరయ్యారు.
నాగార్జున తో కలిసి ఈ స్టేజ్ మీద సందడి చేసి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాడు.రాజమౌళి బిగ్ బాస్ స్టేజ్ మీదకు రాగానే నాగార్జున ఆయనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు.
ఆ తర్వాత నాగార్జున రాజమౌళి ని ఒక విషయం గురించి అడిగారు.రాజమౌళి గారు మీ పేరులో ముందు ఉన్న ఎస్ఎస్ అంటే అర్ధం ఏంటి అని ప్రశ్నించాడు.దీనికి రాజమౌళి ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు.”నిజానికి ఎస్ ఎస్ అంటే శ్రీశైల శ్రీ రాజమౌళి అంతే.కానీ ఇంగ్లీష్ లో చెప్పాలంటే మాత్రం సక్సెస్ అండ్ స్టుపిడ్ అంటారు అని చెప్పగా వెంటనే నాగార్జున సక్సెస్ అంటే ఒప్పుకుంటా కానీ స్టుపిడ్ అంటే మాత్రం ఒప్పుకోను అంటూ నవ్వులు చిందించాడు నాగార్జున.నిన్న జరిగిన ఈ ఎపిసోడ్ నెట్టింట వైరల్ అయ్యింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజేతగా సన్నీ నిలిచాడు.