చెర్రీ తెల్ల కాగితం లాంటివాడు.. ఎన్టీఆర్ గురించి అంతా తెలుసు: రాజమౌళి

టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.

ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు, టీజర్ లకు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా జనవరి 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తెరకెక్కబోతుండడంతో చెర్రీ అభిమానులు, తారక్ అభిమానులు మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే భాగంగా గత కొద్ది రోజులుగా ముంబై లోనే ఉంటున్నారు.ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ రాజమౌళి హీరోల గురించి, హీరోలు సెట్ లో ఎవరు ఎక్కువగా ఆశ్చర్యపరిచారో ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Advertisement

నాకు ఎన్టీఆర్ గురించి బాగా తెలుసు.ఎప్పుడు ఎలా ఉంటాడు ఏం చేస్తుంటాడు.

ఏవిధంగా ఆలోచిస్తాడు.ఒక కథ చెప్పినప్పుడు దాని గురించి ఏమి ఆలోచిస్తాడు.

ఇలా ప్రతి ఒక్కటి కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి నాకు బాగా తెలుసు.కానీ రామ్ చరణ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు.

రామ్ చరణ్ నన్ను చాలా ఆశ్చర్య పరిచేవాడు.షూటింగ్ సెట్ కి రామ్ చరణ్ ఖాళీ మైండ్ తో వచ్చే వాడు.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని

మైండ్ లో ఎటువంటి ఒత్తిడి పెట్టుకోకుండా.ఒక వైట్ పేపర్ లా వస్తాడు.ఒక వైట్ పేపర్, పెన్ ఇచ్చినట్టు వస్తాడు.

Advertisement

అందులో ఏం కావాలో ఇక రాసుకో అన్నట్టు వదిలేస్తాడు.ఇలా ఎన్నో సార్లు రామ్ చరణ్ నన్ను ఆశ్చర్యపరిచాడు.

ఇక సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా ఎవరి స్టైల్ లో వారు నటించారని చెప్పుకొచ్చాడు రాజమౌళి.చాలా సందర్భాల్లో ఇద్దరు నేను కూడా ఊహించని దానికంటే గొప్పగా చేశారు.

అది చూసి నేను చాలా సందర్భాలలో ఆశ్చర్యపోయాను.ఇక షూటింగ్ సెట్ లో అయితే ఇద్దరూ తెగ అల్లరి చేసేవారు.

ఆలియా భట్ మాత్రం క్రమశిక్షణతో ఉండేది అంటూ రాజమౌళి హీరోల గురించి చిత్ర బృందం గురించి తెలిపారు.

తాజా వార్తలు