రాజమౌళి షాకింగ్‌ నిర్ణయం!!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి గత మూడు సంవత్సరాలుగా ‘బాహుబలి’ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.

ఈ మూడు సంవత్సరాల నుండి కూడా రాజమౌళి తర్వాత సినిమా ఎవరితో, ఎలాంటి సినిమాతో చేస్తాడో అంటూ ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే పలువురు హీరోలతో రాజమౌళి సినిమా తెరకెక్కించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.తాజాగా మరో ఆసక్తికర మరియు షాకింగ్‌ విషయం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

అదేంటంటే రాజమౌళి తన తర్వాత సినిమాను రవితేజతో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.గతంలో రాజమౌళి, రవితేజల కాంబినేషన్‌లో ‘విక్రమార్కుడు’ సినిమా వచ్చిన విషయం తెల్సిందే.

‘విక్రమార్కుడు’ భారీ విజయం సాధించింది.ఆ సినిమాతో రవితేజ కెరీర్‌ టర్న్‌ అయ్యింది.

Advertisement

ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని టాక్‌ వినిపిస్తోంది.‘బాహుబలి’ రెండు పార్ట్‌లు విడుదల అయిన తర్వాత రాజమౌళి తదుపరి సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రారంభించనున్నాడు.

రవితేజతో రాజమౌళి సినిమా గురించి ఇప్పటికే చర్చలు జరిపినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు