జక్కన్న 'మహాభారతం'పై విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్... నమ్మొచ్చా?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం లో వచ్చిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా లు సెన్షేషనల్ సక్సెస్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.ఆ సినిమా ల తర్వాత రాజమౌళి తదుపరి సినిమా లపై హాలీవుడ్ స్థాయి లో ఆసక్తి నెలకొంది.

 Rajamouli Father Vijayendra Prasad Comments About Mahabharat Movie-TeluguStop.com

ముఖ్యంగా ఆర్‌ఆర్ఆర్ ( RRR )సినిమా ఆస్కార్ వరకు వెళ్లడం వల్ల రాజమౌళి స్థాయి పెరిగింది.ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడు.

అందులో భాగంగానే కథ ను రెడీ చేశాడు.ప్రస్తతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Alia Bhutt, Mahabharatham, Rajamouli, Rrr, Tollywood-Movie

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివర్లో సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ విషయం పక్కన పెడితే తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ మహా భారతం ( mahabharat movie )సినిమా ను త్వరలోనే ప్రారంభించబోతున్నాం.మహేష్ బాబుతో సినిమా పూర్తి అయిన తర్వాత మహాభారతం ఉంటుందని ఆయన పేర్కొన్నాడు.

అయితే గతంలో విజయేంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యల్లో ఏ ఒక్కటి కూడా నిజం కాదని తేలింది.

Telugu Alia Bhutt, Mahabharatham, Rajamouli, Rrr, Tollywood-Movie

ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా లో ఆలియా భట్( Alia Bhatt ) పాత్ర గురించి విజయేంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు చాలా అంచనాలు పెంచాయి.తీరా ఆర్‌ ఆర్‌ ఆర్‌ లో ఆలియా భట్‌ పాత్ర ఏంటి… ఆమె స్క్రీన్‌ స్పేస్ ఎంత అనేది తేలిపోయింది.అంతా కూడా షాక్ అవుతున్నారు.

మరీ ఇంత దారుణంగా ఆలియా పాత్ర ను చూపించారు ఏంటి అంటూ చాలా మంది ఆలియా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.విజయేంద్ర ప్రసాద్‌ చెప్పిన దాంట్లో కనీసం 25 శాతం కూడా ఆలియా పాత్ర లేకపోవడం దారుణం.

అందుకే విజయేంద్ర ప్రసాద్ మహాభారతం కామెంట్స్ ఎంత వరకు నిజం అనేది చెప్పలేం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube