ఆలియా రుణం ఇంకా తీర్చుకుంటూనే ఉన్న రాజమౌళి

రాజమౌళి( Rajamouli ) తన సినిమాలోని ప్రతి నటీ నటులకు కూడా వారి స్థాయికి తగ్గట్లుగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు.

సెట్‌ ప్రాపర్టీస్‌ ను కూడా వదలకుండా అన్నింటికి ప్రాముఖ్యత ఇస్తూ ఉండే రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో హీరోయిన్ ఆలియా భట్‌ కి( Alia Bhatt ) మాత్రం అన్యాయం చేశాడు.

ఇప్పటి వరకు జక్కన్న చేసిన సినిమాలు అన్నింటిలోకి హీరోయిన్ విషయంలో ఆలియా కు పెద్ద అన్యాయం జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.బాలీవుడ్‌ నెం.1 హీరోయిన్‌, లేడీ సూపర్ స్టార్‌, అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌.ఇలా ఆలియా భట్‌ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్ని విషయాలు అయినా చెప్పుకోవచ్చు.

అలాంటి ఆలియా భట్‌ కి నిజంగానే అన్యాయం జరిగింది అంటూ ఆమె అభిమానులు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా( RRR ) విడుదల సమయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.చివర్లో వచ్చే పాటలో మినహా ఆలియా ఎక్కడ కూడా స్క్రీన్ స్పేస్ విషయంలో సరైన ప్రాధాన్యత కలిగి లేదు.ఆ సమయంలో రాజమౌళి పై తీవ్ర స్థాయి లో ఆలియా కోపంగా ఉందని అంతా అనుకున్నారు.

అయితే ఆలియా ను కూల్‌ చేసేందుకు రాజమౌళి సాధ్యం అయినంత ఎక్కువగా ప్రయత్నాలు చేశాడు.

Advertisement

రణబీర్‌ కపూర్ తో ఆలియా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ను రాజమౌళి సమర్పించాడు.అది కేవలం ఆర్ఆర్‌ఆర్ సినిమా లో ఆలియాకు అన్యాయం చేయడం వల్లే అనే విషయం అందరికి తెలుసు.ఇంకా కూడా ఆ రుణం పూర్తి అవ్వనట్లుంది.

అందుకే ఆలియా కోరిందని రణబీర్ కపూర్( Ranbeer Kapoor ) నటించిన యానిమల్‌ సినిమా( Animal Movie ) యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నేడు రాజమౌళి హాజరు అయ్యాడు.మొత్తానికి రాజమౌళి ఎన్నాళ్లు ఆలియా రుణం తీర్చుకోవాలో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఆలియా ముందు ముందు నటించబోతున్న సినిమాలకి కూడా రాజమౌళి ప్రమోషన్ చేస్తాడేమో చూడాలి.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు