తూర్పుగోదావరి జిల్లా ఏపీ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లా.తూర్పుగోదావరి ఫలితాలు రాష్ట్రంలో అధికార పార్టీ ఎవరని నిర్ణయిస్తాయనే పేరు ఉంది.
‘తూర్పు ఏటైతే రాష్ట్రం కూడా అటే’ అనే నినాదం చాలా పాపులార్.అయితే తాజాగా ఈస్ట్ గోదావరి రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఎంపీ మరగాని భరత్. వైసీపీ సినీయర్ నేతల మధ్య వివాదం నెలకొంది.2019లో తొలిసారి రాజమహేంద్రవరం పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు భరత్.జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకత ఏర్భడంలో భారత్ కారణమవుతున్నారట.
ఇక భరత్ కు పార్టీ సీనియర్ల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ సుబాష్ చంద్రబోస్ ఎంపీకి సహకరించడం లేదు.
ఇతర స్థానిక ప్రముఖ నాయకులు కూడా ఎంపీకి సహకరించడం లేదు.వచ్చేసారి రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేసేందుకు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
గతంలో స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కూడా భరత్ సమస్య ఎదుర్కొన్నారు.అయితే ముఖ్యమంత్రి జగన్ కలగజేసుకుని రాజాతో మాట్లాడి జిల్లా అధ్యక్షుడిని చేయడంతో సమస్యను పరిష్కరించారు.
భరత్ – రాజా ఎపిసోడ్ ముగిసినప్పటికీ, ఇతర సీనియర్లతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

దాదాపు 18 నియోజకవర్గాలు ఉన్న తూర్పు గోదవారి జిల్లా 2018లో వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది.దీంతో అధికారంలోకి రావడం ఆ పార్టీకి సులభతరం అయింది.అయితే తాజా పరిణామాలు పార్టీని కాస్తా కలవరపెడుతున్నాయి.
నేతల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీ ఏమైన నష్టం కలిగిస్తాయా? అనే టెన్షన్ లో వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారు.ఈ విషయంలో జగన్ కలిపించుకుని సమస్య సద్దుమణిగిలే చూడాలని నేతలు కోరుతున్నారు
.