మళ్ళీ స్పీడ్ పెంచుతున్న రాజ్ తరుణ్! వరుసగా నాలుగు సినిమాలతో బిజీ

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు రాజ్ తరుణ్.షార్ట్ ఫిలిం బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాజ్ తరుణ్ కెరియర్ లో మొదటి సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

 Raj Tarun Bounce Back With Four Films-TeluguStop.com

ఇక రెండో సినిమాతో కమర్షియల్ గా హిట్ కొట్టిన రాజ్ తరుణ్.మంచి హైపర్ ఎనర్జీ ఉన్న హీరో గా టాలీవుడ్ లో అందరిని ఆకర్షించాడు.

దీతో హీరోగా వరుస అవకాశాలు అందుకున్నాడు.అయితే ఊహించని విధంగా హ్యాట్రిక్ హిట్స్ తర్వాత రాజ్ తరుణ్ ఖాతాలో అన్ని ఫ్లాప్ సినిమాలే.

ఈ వరుస డిజాస్టర్ సినిమాల కారణంగా ఒక్కసారిగా అతని క్రేజ్ అమాంతం పడిపోయింది.దీంతో ప్రస్తుతం అతని చేతిలో సినిమాలు లేకుండా పోయాయి.

ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ హీరోగా చివరిగా వచ్చిన చిత్రం రాజుగాడు.ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ స్పీడ్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.

దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి కమిట్ అయిన రాజ్ తరుణ్ దీనికోసం రెమ్యునరేషన్ కూడా తీసుకోవడం లేదని తెలుస్తుంది.మరో వైపు ఉయ్యాల జంపాల నిర్మాత కెకె రాధామోహన్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెల్లుస్తుంది.

మరో వైపు విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.అలాగే తాజాగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో కూడా ఓ సినిమా కమిట్ అయినట్లు తెలుస్తుంది.

దీనికి సంబంధించి కాస్టింగ్ కాల్ పోస్ట్ ని తాజాగా రాజ్ తరుణ్ షేర్ చేయడంతో అతను సురేష్ ప్రొడక్షన్ లో సినిమా కమిట్ అయినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube