మనుషుల మధ్య దూరం ఎంతలా పెరిగిపోతుందో ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు కళ్ళకి కట్టినట్లు చూపిస్తూ ఉంటాయి.రక్త సంబంధాలు మధ్య కూడా అనుబంధాలు అంతరించిపోతున్నాయి.
కేవలం డబ్బు మనిషిని నడిపిస్తుంది.డబ్బు వ్యామోహంలో సొంత తల్లిదండ్రులని పిల్లలు, పిల్లల మీద తల్లిదండ్రులు భౌతిక దాడులకి తెగబడుతున్నారు.
ముఖ్యంగా కనిపెంచిన తల్లిదండ్రులని ఆస్తుల కోసం దాడి చేసి, ఇంటి నుంచి బయటకి గెంటేసిన పిల్లలు ఉన్నారు.కొందరైతే మరో అడుగు ముందుకి వేసి తల్లిదండ్రుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు.
తాజాగా అలాంటి సంఘటన తిరుపతిలో జరిగింది.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తిరుపతి నగరంలోని అనంత వీధిలో 88 ఏళ్ల వృద్ధుడు మునికృష్ణయ్య అప్పులు తీర్చడం కోసం తన దగ్గర ఉన్న రెండు సెంట్ల భూమిని అమ్ముకోవడానికి ప్రయత్నించాడు.అయితే ఈ స్థలం అమ్మకం విషయంలో పెద్ద కొడుకు విజయ్ అతని భార్య గత కొంత కాలంగా ముని క్రిష్నయ్యతో గొడవలు పడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ గొడవ రోడ్డు మీదకి వచ్చింది.ఇక విచక్షణ కోల్పోయిన కొడుకు తండ్రి మీద రాడ్డుతో దాడి చేయగా అతనికి భార్య కూడా సహకరించి మామ మీద కారం పొడి చల్ల్లింది.
ఇక ఆ దాడిని తట్టుకోలేక ఆ వృద్ధ తండ్రి ఏడుస్తున్న వారు కనికరించలేదు.ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో మునికృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డాడు.కొడుకు దాడిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.కేసు నమోదు చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.







