సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో అవ్వాలనే వస్తారు.కానీ వారు అనుకున్నది జరిగితే అది సినిమా ఇండస్ట్రీ ఎందుకు అవుతుంది? ఎవరైనా సరే ఏదో ఒకటి కావాలని వస్తే ఏమవుతారో వారికే క్లారిటీ ఉండదు.ఈ ఇండస్ట్రీ అందరికీ అన్ని ఇస్తుంది ఎలా అంటే హీరో అవ్వాలనుకుని వచ్చిన వారికి విలన్ అయ్యే అవకాశం ఇస్తుంది.అలాగే విలన్ గా లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లు కొంతమంది హీరోలు కూడా అవుతారు.
గతంలో మోహన్ బాబు, రవితేజ, శ్రీకాంత్ లాంటి హీరోలు ఇండస్ట్రీకి కేవలం నటులవ్వాలని వచ్చి తొలుత జూనియర్ ఆర్టిస్టుగా సైడ్ క్యారెక్టర్స్( Side Characters ) ప్రయత్నించి ఆ తర్వాత హీరోలుగా మార్చబడ్డారు.అలాగే చాలామంది పెద్ద నటుల పిల్లలు పెద్ద హీరోలు అయిపోతారని కూడా అనుకోవడానికి లేదు.

ఉదాహరణకు బ్రహ్మానందం( Brahmanandam) పిల్లల్ని తీసుకోండి.ఆయన ఎంత పెద్ద నటుడు.ఆయన తలుచుకుంటే సొంతంగా సినిమాలను కూడా నిర్మించగలరు.కానీ కొడుకులు మాత్రం హీరోలు ఎదగలేక పోయారు.ఏవో ఒకటి రెండు ప్రయత్నాలతో వారి సినిమా కెరియర్ ముగిసిపోయింది కదా.అలా అనుకున్న కూర్చుంటే ఇండస్ట్రీకి మంచి నటులు ఎలా దొరుకుతారు.ప్రస్తుతం విలన్ అవతారం ఎత్తి బ్రహ్మానందం కొడుకు రాజ్ గౌతమ్( Brahmanandam Son Raja Goutham ) అద్భుతమైన విలనిజం చూపించాడు ఇటీవల ధూత అనే ఒక వెబ్ సిరీస్ లో.ఈ సినిమాలో అతని నటన వేరే రేంజ్ లో ఉంది.ఏ నటుడే నైనా సరే వారి తండ్రి స్థాయిని చూసి లేదా వారి కుటుంబంలో ఉన్న పెద్ద నటులను చూసి అవకాశం ఇవ్వకూడదు.వారిని సొంతంగా ఎనలైజ్ చేసి వారికి అవకాశాలు ఇచ్చినప్పుడే అతడు లోని అసలు సత్తా ఏంటో అందరికీ అర్థమవుతుంది.

మామూలుగా అయితే రాజు గౌతం మంచి నటుడు అయ్యేవాడు కానీ బ్రహ్మానందం కొడుకు కాబట్టి అతనిని బ్రహ్మానందం స్థాయితో పోల్చి హీరో కన్నా తక్కువగా అవకాశాలు ఇస్తే బాగోదేమో అని పక్కన పెట్టేశారు.కానీ దూత సినిమా( Dhootha Movie )లో అతని విలనిజం చూసిన తర్వాత ఇంత మంచి నటుడు ఎలా ఇన్ని రోజుల పాటు పక్కన ఉంచబడ్డాడు అని అనిపించక మానదు.మరి రాజ్ గౌతమ్ లాంటి నటులు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు.వారిని సరిగ్గా పట్టించుకుంటే వారికి అవకాశాలు ఇస్తే వారిలోని మంచి నటులు ఇంకా బయటకు వస్తారు.
అలాంటి నటులను బయటకు తీసే సత్తా మన దర్షకులలో ఉందా అంటే అది అనుమానమే.