ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నారు.అందులో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటు మరికొంతమంది హీరోలు కూడా ఉన్నారు.
అయితే తాజాగా హీరో నిఖిల్ ను కూడా పాన్ ఇండియా హీరోని చేసేసారు.ఇక అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి అందరికీ తెలిసిందే.నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతడు అతి తక్కువ సమయంలో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
ఈ మధ్య మాత్రం వరుస అవకాశాలతో బాగా పరుగులు తీస్తున్నాడు.పైగా మంచి సక్సెస్ లతో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు.

నిఖిల్ తొలిసారిగా సంబరం సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు.ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాలో నటించి తన నటనకు మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.అలా పలు సినిమాలలో అవకాశాలు అందుకొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.ముఖ్యంగా స్వామిరారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ప్రస్తుతం స్టార్ హోదా వైపు అడుగులు వేస్తున్నాడు.
ఇక ఆ మధ్య విడుదలైన కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.ఈ సినిమా మంచి సక్సెస్ అందించింది.ఇక కార్తికేయ1 సినిమా ఎంత సక్సెస్ అందుకుందో చూసాం.ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందిగా మంచి ఇంట్రెస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అలా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక 18 పేజెస్ సినిమాలో కూడా నటించగా ఆ సినిమా కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది.
ఇక ప్రస్తుతం మరిన్ని ప్రాజెక్టులలో కూడా బిజీగా ఉన్నాడు.అయితే ఇదంతా పక్కన పెడితే.
ఈ సినిమాలతో నిఖిల్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.కేవలం తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషలోకి చెందిన ప్రజలను కూడా అభిమానులుగా మార్చుకున్నాడు.

ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు.తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటాడు.ప్రస్తుతం ఈయన.సీసీఎల్ లో క్రికెట్ ప్లేయర్ గా ఆడుతున్న సంగతి తెలిసిందే.ఈయనతో పాటు మరి కొంతమంది హీరోలు కూడా తమ ఆట తీరుతో బాగా ఆకట్టుకుంటున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా.తను స్టేడియంలో ఉన్న వీడియోను పంచుకున్నాడు.అందులో తను గ్రౌండ్ కి వెళుతున్న సమయంలో.
రాయ్ పూర్ ఫ్యాన్స్ ఆయనను పాన్ ఇండియా స్టార్ అంటూ తెగ పిలుస్తూ కనిపించారు.వెంటనే నిఖిల్ వారి దగ్గరికి వచ్చి వారిని కలిసి మాట్లాడినట్లు కనిపించాడు.
దీంతో ఆ వీడియోను పంచుకుంటూ సినిమాలలోనే కాకుండా క్రికెట్లలో కూడా తనపై మంచి అభిమానం చూపిస్తున్నారు అంటూ పొంగిపోయాడు.ప్రస్తుతం ఆ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.







