తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో ఉన్న విలక్షణ నటుల్లో పోసాని కృష్ణమురళీ కూడా ఒకరు.
కమెడియన్ గా నటుడిగా, దర్శకనిర్మాతగా రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు పోసాని మురళీకృష్ణ.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా పోసాని కృష్ణమురళీ తన జీవితంలో జరిగిన కొన్ని బాధాకరమైన సంఘటనలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.నేను బాగా చదువుకున్నాను.మొదట అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుదాం అనుకున్నాను.
మంచి ఉద్యోగం వచ్చేలా ఉందని నాకు అనేక పెళ్లి సంబంధాలు కూడా వచ్చాయి.కానీ నా క్యారెక్టర్ మీద నిందలు వేసి వాటిని చెడగొట్టారు.
పెళ్లిచూపులు అయిన సంబంధాన్ని కూడా క్యాన్సిల్ అయ్యేలా చేశారు.నాకు మనసు ఉంటుంది ఒక అమ్మాయి తోడు కావాలని ఉంటుంది.
కానీ లవ్వు పోయింది, లవ్లీ లైవ్ పోయింది.నా పెళ్లి సంబంధాలు చెడగొట్టే వారు ఎవరు తెలిసికూడా నేను ఏమి చేయలేకపోయేవాడిని.

ఇక ఒకానొక సమయంలో సహనం నశించి పుస్తకాలలో కత్తి పెట్టుకొని మరీ తిరిగాను అని చెప్పుకొచ్చారు పోసాని కృష్ణమురళీ.మా నాన్న చాలా మంచి వారు కానీ ఒకరోజు పేకాట వల్ల పురుగుల మందు తాగి చనిపోయారు.సాధారణంగా నాకు ఏడుపు రాదు కానీ ఈరోజు నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి.మా అమ్మకు బంగారు గాజులు నాన్నకు బంగారు ఉంగరం ఒక కారు కూడా కొన్ని ఇవ్వాలని ఎన్నో కలలు కన్నాను.
కానీ అవేవీ నెరవేరకుండానే వారిద్దరు చనిపోయారు అంటూ ఇంటర్వ్యూలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు పోసాని కృష్ణ మురళి.







