అక్కినేని ఫ్యామిలీలో యువ హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈయన ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నారు అయితే అఖిల్ హీరోగా కన్నా ఈయనకు క్రికెట్ అంటేనే ఎంతో పిచ్చి ఒకానొక సమయంలో ఈయన మంచి క్రికెటర్ కాబోతున్నారని అందరూ భావించినప్పటికీ నాగార్జున మాత్రం ఈయనని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
బ్యాట్ చేతబట్టి అఖిల్ మైదానంలో దిగారు అంటే తన బ్యాట్ తీరుతో అందరిని ఎంతో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.

సినీతారల క్రికెట్ మ్యాచ్ లు జరిగినప్పుడు అఖిల్ ఎలా చెలరేగుతాడో అందరికి తెలిసిందే.ప్రస్తుతం సిసిఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.రాయ్ పూర్ లో నిన్న తెలుగు వారియర్స్, కేరళ స్టైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో భాగంగా అఖిల్ కేవలం 30 బంతులలోనే 91 పరుగులు చేసిన విషయం మనకు తెలిసిందే.
మ్యాచ్ లో అఖిల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.ఈ విజయాన్ని అఖిల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.

ఈ సందర్భంగా అఖిల్ స్పందిస్తూ మేము వైల్డ్ గా ఆడము నాకు నచ్చిన వ్యక్తులతో కలిసి మ్యాచ్ ఆడటం సంతోషాన్ని ఇచ్చింది.మరోసారి ఇంటికి ట్రోఫీ తీసుకొని వద్దాం.ఈ సందర్భంగా ఈ విజయాన్ని తాను నా మాజీ టీం మేట్ తారకరత్న గారికి అంకితం ఇస్తున్నాను.ఆయన కూడా మాతోపాటు ఈరోజు ఇక్కడ ఉండి ఉంటే బాగుండేది.
అంటూ తారకరత్నకు తన విజయాన్ని అంకితం చేశారు.ఇలా అఖిల్ చేసినటువంటి పనికి నందమూరి అభిమానులతో పాటు, అక్కినేని అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.







