Rahul Sipligunj : రతికతో బ్రేకప్ గురించి తొలిసారి స్పందించిన రాహుల్ సిప్లిగంజ్.. ప్రతి ఒక్కరికీ గతం ఉంటుందంటూ?

రతిక రోజ్‌..

 Rahul Sipligunj First Reaction His Break Rathika Rose Social Media-TeluguStop.com

( Rathika rose ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.

బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ తో( Pallavi Prashanth ) పులిహోర కలపడం అలాగే సమయం సందర్భం వచ్చిన ప్రతిసారి తన మాజీ లవర్ గురించి ప్రస్తావించడం ఎలా అనేక విషయాల ద్వారా బాగా పాపులర్ అయింది.కానీ ఊహించని విధంగా ఈమె ఎలిమిట్ అయ్యి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.

ఆమె ఎలిమినేషన్ పై బస్ ప్రేమికులు మండిపడ్డారు.

Telugu Bigg Boss, Breakup, Rahul Sipligunj, Rathika Rose, Shivaji, Tollywood-Mov

బిగ్ బాస్ ఆమెకు మరొక అవకాశం ఇస్తూ మళ్లీ రీ ఎంట్రీ ఛాన్స్ ఇచ్చినప్పటికీ ఆమె దాని సద్వినియోగ చేసుకోలేకపోయింది.కాగా రతిక హౌస్లో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా తన మాజీ బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తావన తీసుకురావడంతో పాటు, ఆమె హౌస్ లో ఉన్న సమయంలో వారిద్దరు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే.దీనిపై రాహుల్‌ సైతం పరోక్షంగా రతికను ఉద్దేశిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తాజాగా ఒక ప్రోగ్రామ్‌కు హాజరైన రాహుల్‌ రతికతో బ్రేకప్‌ గురించి మొదటి సారి స్పందించాడు.ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ.ప్రతి ఒక్కరికీ గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి.

Telugu Bigg Boss, Breakup, Rahul Sipligunj, Rathika Rose, Shivaji, Tollywood-Mov

భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు.ఆమెతో పాటు హౌస్‌లో ఉన్న ప్రతి కంటెస్టెంట్‌కు నేను ఆల్‌ద బెస్ట్‌ చెప్తున్నాను.బాగా ఆడి కప్పుతో బయటకు రావాలని కోరుకుంటున్నాను.

విన్నర్‌ ఎవరనేది ఇప్పుడే మనం నిర్ణయించలేము.ప్రస్తుతానికైతే భోలె షావళి మంచి వినోదాన్ని అందిస్తున్నారు.

శివాజీ ఇంట్లో పెద్ద వ్యక్తిలా ఉన్నారు.పల్లెటూరు నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్‌ ఒకప్పుడు బిగ్‌బాస్‌ షోను ప్రేక్షకుడిలా చూశాడు.

ఇప్పుడు ప్రేక్షకులు ఆయనను బిగ్‌బాస్‌ హౌస్‌లో చూస్తున్నారు అని చెప్పుకొచ్చారు రాహుల్‌ సిప్లిగంజ్‌.( Rahul sipligunj ) ఈ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube