భారత జట్టు తన సొంత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) టోర్నీలో ఓటమి అనేదే ఎరుగకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.ఇక భారత జట్టుతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లలో వణుకు పుడుతోంది.
భారత జట్టు ఆటగాళ్లను ఎలా కట్టడి చేయాలో తెలియక ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు మైదానంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.భారత్ తో తలపడిన ప్రతి ప్రత్యర్థి జట్టు భారత్ ను ఓడించేందుకు ఎన్ని ప్రణాళికలతో బరిలోకి దిగిన భారత జట్టు ఆటగాళ్ల ఫామ్ ముందు ఏ ప్రత్యర్థి జట్టు కుప్పిగంతులు సాగలేదు.
మ్యాచ్ ఆరంభంలో ఎలా ఉన్నా మ్యాచ్ చివరికి వచ్చేసరికి గెలుపు మాత్రం భారత్ వైపు ఉంటుంది.ఇక వన్డే వరల్డ్ కప్ టైటిల్ విన్నర్ భారత్ అని టోర్నీలో పాల్గొనే జట్లన్నీ భావిస్తున్నాయి.
![Telugu Australia, Gill Christ, India, Jasprit Bumrah, Latest Telugu, Netherlands Telugu Australia, Gill Christ, India, Jasprit Bumrah, Latest Telugu, Netherlands](https://telugustop.com/wp-content/uploads/2023/11/team-imdia-sports-mews-sports-Gill-Christ-India-Netherlands-Australia-odi-world-cup.jpg)
భారత జట్టు తన తదుపరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై గెలిస్తే ఈ టోర్నీ లీగ్ మ్యాచ్లలో వరుస 9 విజయాలు సాధించినట్టే.భారత జట్టు నెదర్లాండ్స్ జట్టు తో జరిగే మ్యాచ్ పై కాకుండా సెమీఫైనల్ మ్యాచ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది.ఈ క్రమంలో భారత జట్టు ఆటతీరును బాగా పసిగట్టిన ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం ఆడం గిల్ క్రిస్ట్( Gill Christ ) భారత జట్టును ఓడించేందుకు ఓ సలహా ఇచ్చాడు.
![Telugu Australia, Gill Christ, India, Jasprit Bumrah, Latest Telugu, Netherlands Telugu Australia, Gill Christ, India, Jasprit Bumrah, Latest Telugu, Netherlands](https://telugustop.com/wp-content/uploads/2023/11/team-imdia-virat-kohli-sports-mews-sports-Gill-Christ-India-Netherlands-Australia-odi-world-cup.jpg)
భారత్ తో మ్యాచ్ ఆడే ప్రత్యర్థి జట్టు టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ ఎంచుకోవాలి.ఎందుకంటే.చేజింగ్ లో ప్రత్యర్థి జట్లు లైట్ల కింద భారత బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టం.
మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా( Jasprit Bumrah ), మహమ్మద్ షమీ లాంటి బౌలర్ల ను లైట్ల కింద కంటే పగటిపూట ఎదుర్కోవడమే కాస్త బెటర్ అని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.అయితే భారత జట్టు చేజింగ్ లో బలహీనం కాదు.
భారత జట్టులో చేజర్లు ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నారు.కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేస్తే భారత జట్టుపై గెలిచే అవకాశాలు ఉంటాయి కానీ ఖచ్చితంగా గెలుస్తాయని చెప్పలేం.