ప్రస్తుతం దేశంలో బీజేపీపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడటానికి కసరత్తులు చేస్తోంది.ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలోనే దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు.
ప్రధానంగా 13 రాష్ట్రాల్లో రాహుల్ పర్యటన ఉంటుందని అంటున్నారు.ఈ నేపథ్యలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా రాహుల్ పాదయాత్ర చేస్తారని సమాచారం.
అయితే ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కనుమరుగైన విషయం తెలిసిందే.అయితే మళ్లీ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ ఏపీలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
అన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్ నుంచి రాహుల్ గాంధీ దేశవ్యాప్త పాదయాత్ర మొదలవుతుందని అంటున్నారు.అయితే ఈ యాత్ర నూటాభై రోజుల పాటు కొనసాగుతుందట.
అలాగే దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో సగం కంటే పైగా రాష్ట్రాలను రాహుల్ చుట్టేస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే రాహుల్ పర్యటనపై రూట్ మ్యాప్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ పాదయాత్ర కాశ్మీర్ టూ కన్యాకుమారి వరుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.రాహుల్ తన పాదయాత్రను సౌత్ నుంచే మొదలుపెడతారని కూడా అంటున్నారు.
అయితే మొదట రూట్ మ్యాప్ లో కేవలం తెలంగాణ మాత్రమే ఉందని అంటున్నారు.అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీలో కూడా రాహుల్ పర్యటించనున్నట్లు చెబుతున్నారు.
ఇక ఏపీలో ఎక్కడ పర్యటిస్తారో క్లారిటీ లేకపోయిప్పటికీ రూట్ మ్యాప్ అనౌన్స్ తర్వాత తెలిసే అవకాశం ఉంది.
ఏం మాట్లాడతారనే ఆసక్తి.
.
అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది.జగన్ ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడే.కానీ అనూహ్య కారణాలతో బయటకు వచ్చి ఏపీలో అధికారాన్ని చేపట్టారు.ఇక ఇప్పుడు రాహుల్ రాకతో ఏపీలో జగన్ ను ఉద్దేశించి ఏం మాట్లాడతారోనని అంటున్నారు.జగన్ పై ఎలాంటి విమర్శలు చేస్తారోననే ఆసక్తి నెలకొంది.
అయితే జగన్ పాలనపై రాహుల్ ప్రధానంగా మాట్లాడతారనే చర్చ జరుగుతుంది.కాగా జగన్ పై ఇప్పటి వరకు పెద్దగా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు.
ఏపీలో కాంగ్రెస్ ఉనికే లేని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ రాక చర్చకు దారితీస్తోంది.ప్రస్తుతం దేశంలో మారుతున్న వాతావరణం బట్టి ఏపీలో కూడా ఎంతో కొంత కూడగట్టుకోవాలన్న కొత్త ఆలోచనలు అయితే కాంగ్రెస్ పెద్దలకు వస్తున్నాయట.

అందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర ఏపీలో ఉండేలా ప్లాన్ చేశారని అంటున్నారు.అయితే ఏపీలో రాహుల్ గాంధీ పక్కాగా పాదయాత్ర ఉంటుందని పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ అంటున్నారు.ఏపీలో రాహుల్ పాదయాత్రను తాము విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.మోడీ జపంతో ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న జగన్ సర్కార్ ని ఎడగడతామని కూడా అంటున్నారు.
ఇక ఏపీలో రాహుల్ ఎంట్రీతో పొలిటికల్ హీట్ పెంచేలా ఉందని చెప్పవచ్చు.
.