కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )నామినేషన్ దాఖలు చేశారు.ఈ మేరకు రెండోసారి వయనాడ్ ఎంపీ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీకి దిగనున్నారు.
నామినేషన్ వేసేందుకు వెళ్లే సమయంలో రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ షోలో కాంగ్రెస్ కీలక నేతలు ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ ( Priyanka Gandhi , KC Venugopal )తో పాటు దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు.
కాగా రెండో విడతలో భాగంగా ఈ నెల 26వ తేదీన వయనాడ్ లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.అలాగే 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ సుమారు 4.3 లక్షల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.