వయనాడ్ ఎంపీ స్థానానికి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు

కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )నామినేషన్ దాఖలు చేశారు.

ఈ మేరకు రెండోసారి వయనాడ్ ఎంపీ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీకి దిగనున్నారు.

నామినేషన్ వేసేందుకు వెళ్లే సమయంలో రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ షోలో కాంగ్రెస్ కీలక నేతలు ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ ( Priyanka Gandhi , KC Venugopal )తో పాటు దీపాదాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు.

కాగా రెండో విడతలో భాగంగా ఈ నెల 26వ తేదీన వయనాడ్ లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

అలాగే 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ సుమారు 4.

3 లక్షల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మంచు వివాదంలో తప్పు మనోజ్ దేనా.. ఆ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయిగా!