పరుగుల వరద పారించిన అజింక్య రహానే.. అభిమానుల ప్రశంసలు..!

ఈ ఐపీఎల్ లో చెన్నై జట్టు ఆటగాళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అది అజింక్య రహానే( Ajinkya Rahane ) గురించే.

ఆకాశమే హద్దుగా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

ఇక సోషల్ మీడియాలో అతడి ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు.అజింక్య రహానే ఆడుతున్న మెరుపు ఇన్నింగ్స్ తో మళ్లీ టీమిండియా జట్టులోకి ఎంపిక చేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కొందరేమో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో పంత్ స్థానంలో రహనే ఉంటే బాగుంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

కొంతకాలం ఫామ్ కోల్పోయి క్రికెట్ కు దూరం అయినా రహానే తాజాగా జరుగుతున్న మ్యాచ్లలో తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు.తాజాగా కోల్ కత్తా - చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో రహానే 29 బంతుల్లో 71 పరుగులు చేశాడు ఈ 2023 ఐపీఎల్ లో ఐదు మ్యాచ్లు ఆడిన రహానే 199 స్ట్రైక్ రేట్ తో 29 పరుగులు చేశాడు.తరువాత జరగాల్సిన మ్యాచ్లలో కూడా ఇదే స్ట్రైక్ రేట్ నమోదు చేస్తే అత్యుత్తమ రికార్డులు కూడా ఖాతాలో పడడం ఖాయం.

Advertisement

ఈ క్రమంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడితే పొగడడం.చెత్త ఇన్నింగ్స్ ఆడితే విమర్శించడం మామూలే.కేవలం రూ.50 లక్షలు వేచించి చెన్నై ఫ్రాంచైజీ రహానే ను కొనుగోలు చేసింది.దీంతో రూ.3.8 కోట్లు పలికిన రియాన్ పరాగ్( Riyan Parag ) దారుణంగా విఫలం అయ్యాడని విమర్శలు మొదలయ్యాయి. రహానే 2.0 వెర్షన్ అంటూ అభిమానులు అభివర్ణిస్తున్నారు.

ఈ విషయాలపై రహనే స్పందిస్తూ.

తన నుంచి ఇంకా అత్యుత్తమ ఇన్నింగ్స్ రాలేదని తెలిపాడు.ప్రతి క్రికెటర్ ఎమ్.

ఎస్.ధోనీ కెప్టెన్సీ( MS Dhoni )లో ఆడాలని కోరుకుంటారని, ధోని కెప్టెన్సీలో తాను చాలా మెరుగయానని తెలిపాడు.తాజాగా కోల్ కత్తా తో జరిగిన మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ఏకంగా నాలుగు అవార్డులు రహానే సొంతం చేసుకున్నాడు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

తర్వాతి మ్యాచ్లలో కూడా మెరుగ్గా ఆడెందుకు తన వంతు కృషి చేస్తానని తెలపడంతో చెన్నై జట్టు అభిమానులు సంతోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు