రిలీజ్ ఆర్డ‌ర్‌పై సంత‌కం చేయ‌ని ర‌ఘురామ‌.. ఇంకా క‌స్ట‌డీలోనే...?

ఏపీలో ఇప్పుడు ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం ఎంత హాట్ టాపిక్ గా ఉందో అంద‌రికీ తెలిసిందే.అయితే ఆయ‌న మాత్రం ఇప్పుడు వ‌రుస చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు.

ఇప్పుడు తాజాగా ఆయ‌న‌కు మ‌రో షాక్ త‌గిలింది.ఆయ‌న ప్ర‌స్తుతం బెయిల్ మీద బ‌య‌ట ఉండ‌గా.

ఇక్క‌డే ఆయ‌న ఓ మిస్టేక్ చేశారు.గ‌త‌నెల మే21న సుప్పీంకోర్టు ఆయ‌న‌కు బెయిల్ ఇస్తూ కొన్నిష‌ర‌తులు కూడా పెట్టింది.

అయితే బెయిల్ ఇచ్చిన రోజు నుంచి స‌రిగ్గా ప‌ది రోజుల్లో గుంటూరులోని సీఐడీ కోర్టుకు బెయిల్ కు సంబంధించిన ముఖ్య‌మైన బాండ్లను అప్ప‌జెప్పాల‌ని సుప్రీంకోర్టు బెయిల్ తీర్పులో వెల్ల‌డించింది.కానీ ర‌ఘురామ మాత్రం ఆ ప‌నిచేయ‌కుండా ఆర్మీ ఆస్ప‌త్రి నుంచి 24వ తేదీన డిశ్చార్జి అయి డైరెక్టుగా హ‌స్తిన‌కు ప‌య‌న‌మ‌య్యారు.

Advertisement

ఆ త‌ర్వాత 28వ తేదీన ఎంపీ తరఫున వాదిస్తున్న లాయ‌ర్లు గుంటూరులోని సీఐడీ కోర్టులో షూరిటీ ఆర్డ‌ర్లు అంద‌జేశారు.దాంతో కోర్టు కూడా ఎంపీ బెయిల్ కు అటాచ్ చేసే రిలీజ్‌ ఆర్డర్‌ను జిల్లా కేంద్రంలోని జైలుకు జారీ చేసింది.

అయితే ఆ రిలీజ్ ఆర్డ‌ర్ల‌ను ఆర్మీ ఆస్ప‌త్రికి పంపించ‌గా ర‌ఘురామ అప్ప‌టికే డిశ్చార్జి అయి ఢిల్లీకి వెళ్లారు.కాగా ఆ రిలీజ్ ఆర్డ‌రుపై ర‌ఘురామ సంత‌కం చేయ‌లేదు.వాటిని ఆర్మీ ఆస్ప‌త్రి వ‌ర్గాలు తిరిగి గుంటూరు జైలుకే పంపించాయి.

సంతకం చేయకపోవ‌డంతో ర‌ఘురామ టెక్నిక‌ల్‌గా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నట్లే అవుతుంది.దీన్ని కోర్టు కూడా ఆమోదిస్తూ ఆయన రిమాండ్‌ను కాస్తా జూన్ 25వ తేదీ దాకా పొడిగించింది.

ఇక దొరికిందే అవ‌కాశం అన్న‌ట్టు సీఐడీ ఆఫీస‌ర్లు ర‌ఘురామ‌ను త్వ‌ర‌లోనే గుంటూరుకు ర‌ప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ నేప‌థ్యంలోనే ర‌ఘురామ‌పై చర్యలు తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్ అయితే హంసపాల్ రీసెంట్‌గా స్థానిక ఎస్పీకి లేఖ రాసి ఫిర్యాదు చేశారు ఆయ‌న‌.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

దీంతో ఆయ‌న క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు