గతేడాది విడుదలైన సినిమాలలో సీతారామం సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఈ మూవీ క్లైమాక్స్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.పాజిటివ్ ఎండింగ్ తో ఈ సినిమా క్లైమాక్స్ ను తెరకెక్కించి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపించాయి.
అయితే ఈ సినిమాను తెరకెక్కించిన బ్యానర్ నుంచి అన్నీ మంచి శకునములే మూవీ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.నందినీ రెడ్డి డైరెక్షన్ లో తెరకక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో పాల్గొన్న రాఘవేంద్ర రావు మాట్లాడుతూ సంతోష్ శోభన్, మాళవిక కాంబినేషన్ బాగుందని పేర్కొన్నారు.నందిని, స్వప్న, ప్రియాంక ఈ పాటను విడుదల చేయాలని ఆహ్వానించారని రాఘవేంద్ర రావు పేర్కొన్నారు.
అశ్వనీదత్( Aswani Dutt ) బ్యానర్ లో 14 సినిమాలు చేశానని దాదాపుగా అన్ని సినిమాలు హిట్ అయ్యాయని ఆయన తెలిపారు.సీతారామం సినిమాను నేను ఇప్పటికీ మరిచిపోలేనని ఆయన తెలిపారు.సీతారామం( Sita Ramam ) తర్వాత వస్తున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని రాఘవేంద్ర రావు( Raghavendra Rao ) కామెంట్లు చేశారు.అయితే సీతారామం సినిమాకు సంబంధించి నాకు ఒకటే బాధ ఉండిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు.
నేను చెప్పే ఐడియాను సీతారామం డైరెక్టర్ కు చెప్పాలని ఆయన కామెంట్లు చేశారు. రామ్ కోసం బాధ పడే సీత విలన్ దగ్గరికి వెళ్లి అతనిని కాల్చాలని అనుకుంటుందని ఆ సమయంలో రామ్ చావలేదని తెలుస్తుందని ఆ తర్వాత రామ్ సీత కొత్త జీవితాన్ని మొదలుపెడతారని కుటుంబ సభ్యులు వాళ్లను ఎలా ఇబ్బంది పెట్టారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తే బాగుంటుందని రాఘవేంద్రరావు పేర్కొన్నారు.