తాజాగా హైదరాబాద్ లో ర్యాడిసన్ హోటల్ ఫుడ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ వెలుగు చూసిన విషయం తేలిసిందే.అయితే ఈ ఘటనకు సంబంధించి 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం కూడా తెలిసిందే.
అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆయన 150 మంది లో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు కూడా ఉన్నారు.ఈ నేపథ్యంలోనే వారిపై మీడియాలో వస్తున్న కథనాలఫై ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాము ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, అంతేకాకుండా పబ్బులో ఉన్నంత మాత్రాన తమపై నిందలు వేయడం సరికాదు అంటూ మీడియాను వేడుకుంటున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ విషయంపై స్పందించిన విషయం తెలిసిందే.
తాజాగా మరొక జూనియర్ ఆర్టిస్ట్ అయిన కల్లపు కుషితా కూడా స్పందిస్తు ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేసింది.ఆ వీడియోలో లేట్ హవర్స్ పబ్బులో ఉండటం మా తప్పు కాదు.
అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారు అన్న విషయం మాకు నిజంగా తెలియదు అని తెలిపింది కుషితా.డ్రగ్స్ వినియోగిస్తున్నారు అని తెలిస్తే మేము అక్కడికి ఎందుకు వెళ్తాము? అయితే పార్టీలో ఎక్కువ రష్ ఉన్నారు అన్న మాట వాస్తవమే కానీ, మా ఫ్రెండ్స్ పార్టీ అయిన తర్వాత బయటికి వెళ్దాం అనుకునే లోపే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు అని తెలిపింది.ఎవరో డ్రగ్స్ తీసుకుంటే అందరినీ బాధ్యులను చేయడం, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం సరికాదని ఆమె తెలిపింది.

అంతేకాకుండా పోలీసులు వారి డీటెయిల్స్ తీసుకున్నారని, అందుకు వారు పోలీసులకు సహకరించామని, కావాలి అంటే మా రక్త నమూనాలు కూడా తీసుకోండి, ఎప్పుడు శాంపిల్స్ ఇవ్వడానికైనా మేము సిద్ధమే అని చెప్పుకొచ్చింది కుషితా.మీడియా వారు కూడా కొంచం సమన్వయం పాటించాలి అని, పబ్బు కి వచ్చిన వాళ్లందర్నీ బద్నాం చేయడం సరికాదని, మేము ఇప్పుడే ఇప్పుడే సినిమారంగంలో ఎదుగుతున్నాము, ఇలాంటప్పుడు మమ్మల్ని బద్నామ్ చేయడం సరికాదని, పబ్ లో ఉన్నా వారందరిపై ఇలా దుష్ప్రచారం చేయడం సరికాదని,పబ్ లో అందరి రక్తం నమూనాలు సేకరించి ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోండి.అందుకు మేము కూడా సహకరిస్తానని తెలిపింది కుషితా.
ఇలాంటి దుష్ప్రచారాల వల్ల మా కుటుంబసభ్యులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కుషితా.







