ఆరు పదుల వయస్సులో కూడా ఊరమాస్ సినిమాలలో నటిస్తూ బాలకృష్ణ పాపులారిటీని పెంచుకున్నారు.అఖండ సక్సెస్ తర్వాత గోపీచంద్ మలినేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య ఈ సినిమాతో అఖండ సినిమాను మించిన సక్సెస్ ను సొంతం చేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని విదేశాల్లో కూడా కొన్ని సన్నివేశాలు ఉంటాయని సమాచారం అందుతోంది.
అయితే బాలయ్యకు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ భారీ షాకిచ్చింది.
బాలయ్య పీఏ అయిన బాలాజీ కొన్నిరోజుల క్రితం పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే.అయితే ఈ విషయంలో ప్రభుత్వానికి నివేదిక అందగా ప్రభుత్వం బాలాజీ డిప్యుటేషన్ ను రద్దు చేసింది.
ప్రభుత్వం బాలాజీ డిప్యుటేషన్ ను రద్దు చేసిన తర్వాత ఆయనను అడల్ట్ ఎడ్యుకేషన్ సూపర్ వైజర్ గా నియమించింది.

ప్రభుత్వం ఈ విధంగా చేయడంతో బాలకృష్ణ కొత్త పీఏను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.బాలాజీ ప్రభుత్వ ఉద్యోగి కాగా బాలయ్య ఆయనను పీఏగా నియమించుకుంటానని కోరితే ఏపీ సర్కార్ అంగీకరించింది.బాలయ్య ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండటంతో హిందూపురంలో ఆయనకు సంబంధించిన ముఖ్యమైన పనులను ఇప్పటివరకు పీఏ చక్కబెడుతున్నారని సమాచారం అందుతోంది.

గతంలో కూడా బాలయ్య పీఏల వ్యవహారశైలి వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.బాలాజీ కొన్నిరోజుల క్రితం పేకాట ఆడుతూ దొరికిపోయినా బాలయ్య నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదు.అందువల్ల ఏపీ ప్రభుత్వం ఆయనను బాలయ్యకు పీఏగా కొనసాగించడానికి ఇష్టపడలేదని సమాచారం అందుతోంది.బాలకృష్ణ రాబోయే నాలుగేళ్లలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నారు.తన శైలికి భిన్నంగా స్టార్ డైరెక్టర్లకు బాలకృష్ణ వరుసగా అవకాశాలను ఇస్తుండటం గమనార్హం.బాలయ్య తర్వాత సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయని తెలుస్తోంది.







