నటుడు శరత్ కుమార్( Actor Sarathkumar ) రాజకీయ నాయకుడిగా, నటుడిగా, సినిమా నిర్మాతగా అనేక రకాల బాధ్యతలను చాలా ఏళ్లుగా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు.అయితే ఆయన సినిమా జీవితం కాసేపు పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి.
పెళ్లికి ముందు ఎఫైర్స్, పెళ్లి తర్వాత ఎఫైర్స్, అలాగే మొదటి పెళ్లి తర్వాత రెండవ పెళ్లి, మొదటి భార్య పిల్లలు, రెండవ భార్య పిల్లలు ఇలా రకరకాల చిక్కుముడుల చుట్టూ ఆయన జీవితం ఉంటుంది.అయితే ఇటీవల సోషల్ మీడియాను మనం గమనిస్తే శరత్ కుమార్ తన ఇద్దరు భార్యలు, వారిద్దరికి చెరో ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా ఉన్న వీడియోలు చెక్కర్లు కొడుతున్నాయి.
శరత్ కుమార్ కి ఇద్దరు భార్యలు ఛాయా మరియు రాధిక.ఛాయా( Chaya Sarathkumar )కి ఇద్దరు కుమార్తెలు కాగా రాధికకి శరత్ కుమార్ తో ఒక కొడుకు సంతానం ఉన్నాడు.
అలాగే అంతకన్నా ముందు రాధిక కు తన రెండో వివాహం ద్వారా ఒక కుమార్తె కూడా సంతానంగా ఉంది.

ఇక్కడ ఒక విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి.శరత్ కుమార్ కి నలుగురు పిల్లలు అని మనం ఎక్కడ చూసినా వింటాం.కానీ ముగ్గురు పిల్లలు మాత్రమే.
మొదటి భార్య ద్వారా ఇద్దరు కూతుళ్లు పుడితే రెండవ భార్య ద్వారా ఒక కొడుకు మాత్రమే పుట్టాడు.అయినా కూడా రాధిక( Raadhika Sarathkumar )కు పుట్టిన రెండవ భర్త కుమార్తెను తన సొంత కూతురు కన్నా ఎక్కువగా శరత్ కుమార్ ప్రేమిస్తూ వస్తున్నాడు.
ఆమె పెళ్లిని తన చేతుల మీదుగా చేశాడు.మనవడు, మనవరాలిని కూడా పెంచుతున్నాడు.
అంతా ప్రేమగా రాధిక తన రెండవ భర్త ద్వారా పొందిన సంతానంపై శరత్ కుమార్ ప్రేమను చూపించడం చాలాసార్లు ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది.

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు చాలా కామన్ అలాగే విడాకులు తీసుకోవడం మళ్ళీ పెళ్లి చేసుకోవడం కూడా కామన్.ఇలాజె అనేకసార్లు జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు శరత్ కుమార్ మరియు రాధిక.రాధిక సైతం తనం భర్త మొదటి భార్య సంతానాన్ని అంతే ప్రేమగా చూస్తున్నారు.
ఎన్నోసార్లు వరలక్ష్మి( Varalaxmi Sarathkumar ) రాధిక కలిసి ఉండడం మనం గమనిస్తూనే వస్తున్నాం.ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు.కుటుంబంలో పెళ్లి అనే బంధం వేరు, బంధం ఉండటం వేరు అని వీరిని చూస్తేనే అర్థమవుతుంది.భార్యతో సంబంధం ఉండక్కర్లేదు కానీ పుట్టిన పిల్లలు ఎప్పుడు మన పిల్లలే అని ఈ రెండు కుటుంబాలు నిరూపిస్తున్నాయి.