ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం( Government Job ) సాధించాలంటే రేయింబవళ్లు ప్రిపరేషన్ కే పరిమితం అవ్వాలి.అయితే ఒక మహిళ మాత్రం ఒకవైపు హోటల్ ను నిర్వహిస్తూ మరోవైపు రెండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు.
ఖాళీ సమయాలలో యూట్యూబ్ లో క్లాసులు( YouTube Classes ) వింటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిన ఈ మహిళ సక్సెస్ తో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటూ వార్తల్లో నిలవడం గమనార్హం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేసముద్రంకు చెందిన చీకటి జ్యోతి( Cheekati Jyothi ) పెళ్లికి ముందు ఇంటర్ వరకు చదువుకున్నారు.
పెళ్లి తర్వాత భర్త సహాయసహకారాలతో జ్యోతి ఎం.ఏ, బీఈడీ పూర్తి చేశారు.7 రోజుల క్రితం వెలువడిన పీజీటీ ఫలితాలలో, గురువారం రోజున రిలీజైన జూనియర్ లెక్చరర్ ఫలితాలలో జ్యోతి ఉద్యోగం సాధించారు.

భర్త సహకారం వల్లే తాను కెరీర్ పరంగా సక్సెస్ అయ్యానని ఆమె చెబుతున్నారు.ఒకే సమయంలో రెండు ఉద్యోగ ఖాళీలకు ఎంపిక కావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని జ్యోతి చెబుతున్నారు.2017 సంవత్సరంలో డీఎస్సీ పరీక్ష( DSC Exam )కు హాజరయ్యానని కొన్ని మార్కుల తేడాతో ఆ జాబ్ రాలేదని జ్యోతి వెల్లడించారు.జ్యోతి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో కుటుంబానికి సంబంధించిన ఆర్థిక సమస్యలు( Financial Problems ) తీరే అవకాశం ఉంది.జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

పెద్ద కొడుకు మల్టీమీడియాలో ట్రైనింగ్ తీసుకుంటుండగా చిన్న కొడుకు ఇంటర్ చదువుతున్నారు.2018 సంవత్సరం నుంచి జ్యోతి దంపతులు హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.ధైర్యంతో ముందడుగులు వేస్తే సక్సెస్ సొంతమవుతుందని జ్యోతి చెబుతున్నారు.ఫెయిల్యూర్ కు కుంటిసాకులు చెప్పేవాళ్లు జ్యోతిని స్పూర్తిగా తీసుకుంటే కెరీర్ పరంగా విజయాలు సొంతమవుతాయని చెప్పవచ్చు.జూనియర్ లెక్చరర్( Junior Lecturer ) ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షలకు హాజరవుతానని జ్యోతి కామెంట్లు చేయడం గమనార్హం.








