నేహా శెట్టి( Neha Shetty ) పరిచయం అవసరం లేని పేరు.ఈమె ఇదివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించారు.
అయితే ఈమె ఇదివరకు పలు సినిమాలలో నటించిన రాని గుర్తింపు ఈమెకు డీజే టిల్లు( DJ Tillu ) సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చిందని చెప్పాలి.ఇక ఈ సినిమాలో ఈమె రాధిక పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.
సిద్దు జొన్నలగడ్డ ( Siddu Jonnalagadda ) హీరోగా నటించినటువంటి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈమెకు తెలుగులో కూడా వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.ఇక త్వరలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ( Gangs of Godavari ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

విశ్వక్ సేన్( Vishwak Sen ) హీరోగా నటించినటువంటి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో నేహా శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణాలను తెలియజేశారు.చిన్నప్పటినుంచి తనకు హీరోయిన్ అవ్వాలని చాలా కోరికగా ఉండేదని ఈ సందర్భంగా నేహా శెట్టి వెల్లడించారు.

ఇక తాను ఇండస్ట్రీలోకి రావాలనుకోవడానికి కారణం లేకపోలేదని తాను ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి ఐశ్వర్యరాయ్ ( Aishwarya Rai ) దీపిక పదుకొనేల(Deepika Padukone) ను చూసి తాను కూడా ఇండస్ట్రీలోకి రావాలనే కోరిక పెంచుకున్నానని తెలిపారు.ఈ క్రమంలోనే వారిలాగే తాను కూడా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నానని తెలియజేశారు.ఇలా నేను హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చాను అంటే వారిద్దరే నాకు స్ఫూర్తి అని వారి వల్లనే హీరోయిన్ అవ్వాలని కోరిక కూడా తనలో కలిగింది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.