Racha Ravi : చెల్లెల్ని తలచుకొని కన్నీరు పెట్టిన రచ్చ రవి.. ఇంటికి రావడం లేదు అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు బుల్లితెర కమెడియన్ రచ్చ రవి ( Racha Ravi )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒకప్పుడు జబర్దస్త్( Jabardast ) లో స్కిట్లు చేసి ఎంతోమంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నాడు రచ్చ రవి.

తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవించాడు.జబర్దస్త్ షో ద్వారా భారీగా క్రేజ్ ని ఏర్పరుచుకున్నారు.

అంతేకాకుండా వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించాడు రచ్చ రవి.సినిమాలపై ఉన్న మక్కువతో సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇచ్చిన రచ్చ రవి ఎన్నో రకాల అవమానాలను కష్టాలను ఎదుర్కొని నేడు సెలబ్రిటీగా మారాడు.

తాను ఈ స్థాయిలో ఉండటానికి అమ్మానాన్నలతో పాటుగా తన చెల్లి కూడా ఎంతో సహాయం చేసిందీ అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఈ స్టార్ కమెడియన్.జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర( Chammak Chandra ) తో కలిసి స్కిట్ వేసి తీసుకోలేదా రెండు లక్షల కట్నం అనే ఒకే ఒక డైలాగ్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా క్రేజీని ఏర్పరచుకున్నాడు రచ్చ రవి.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఇంటర్వ్యూలో భాగంగా రచ్చ రవి మాట్లాడుతూ.

Advertisement

ప్రతీ రాఖీ పండుగకు నేను నా చెల్లి దగ్గరికి పోయి రాఖీ కట్టించుకుంటాను.కానీ కొన్ని సంవత్సరాలుగా మా చెల్లెలు మా ఇంటికి రావడం లేదు.

2016లో నా ఇంటి గృహప్రవేశానికి వచ్చిన నా చెల్లెలు తర్వాత నుంచి మా ఇంటికి రాలేదు.ఇక నేను ఇంత సంపాదించుకున్నాను అంటే దానికి కారణం మా చెల్లి రజితనే.తాను ఇచ్చిన రూ.123 రూపాయల తీసుకొని నేను హైదరాబాద్ కు వచ్చాను.నేను ఇప్పుడు ఇంత సంపాదించి, ఈ స్థాయిలో ఉన్నాను అంటే నా చెల్లెలే కారణం అని చెప్పుకొచ్చాడు రచ్చ రవి.అయితే గత కొంత కాలంగా చెల్లెలు రజిత తన ఇంటికి రావాట్లేదని బోరున ఏడ్చేసాడు.తప్పు చేస్తే చెప్పాలి కానీ ఇలా ఇంటికి రాకుండా ఉండడం ఏంటి అంటూ ఇంటర్వ్యూలో తన చెల్లిని తలచుకొని ఫుల్ ఎమోషనల్ అయ్యాడు రచ్చ రవి.నా దగ్గర అన్నీ ఉన్నా కూడా నా చెల్లెలు నా ఇంటికి రాకపోవడమే నాకు అత్యంత బాధాకరమైన విషయం అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు.

Advertisement

తాజా వార్తలు