టాలీవుడ్ అందాల భామ రాశి ఖన్నా బొద్దు బొద్దు అందాలతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తూ పలు సక్సెస్ సాధించింది.
ఇక ఈ బ్యూటీ దాదాపు అందరు యంగ్ హీరోలతో పాటు పలువురు స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి మెప్పించింది.
కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా రాశి ఖన్నా స్వీయ నిర్భంధంలో ఉంది.
ఈ లాక్‌డౌన్ కాలాన్ని ఆమె పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుందట.ఆమె ఈ సమయంలో రెండు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
గిటార్ వాయించడంతో పాట తమిళ భాషను కూడా చాలా ఆసక్తిగా నేర్చుకుంటుందట ఈ బ్యూటీ.తమిళంలో తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకునేందుక వీలుగా ఆ భాషను నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి అందరిలా రాశి ఖన్నా కూడా లాక్‌డౌన్ సమయంలో కొత్త విషయాలను నేర్చుకునేందుకే ప్రాధాన్యత ఇస్తోంది.ఇక సినిమాల పరంగా కూడా రాశి ఖన్నా చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటోంది.