పబ్లిసిటీ కోసమే ఆటోల్లో తిరుగుతారట.. కామెంట్లకు నారాయణమూర్తి జవాబిదే!

ఆర్.నారాయణమూర్తి గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 R Narayanamurthy Reaction About Negative Comments Details, Narayana Murthy, Nara-TeluguStop.com

డబ్బు కంటే విలువలకు ప్రాధాన్యత ఇచ్చే అతికొద్ది మంది నటులలో నారాయణమూర్తి ఒకరని చెప్పవచ్చు.ఇండస్ట్రీలో నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా నారాయణమూర్తి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

రైతు కుటుంబంలో జన్మించిన నారాయణమూర్తి హీరో కావాలనే ఆశయంతో సినిమాల్లోకి వచ్చారు.

కమర్షియల్ సినిమాలలో ముఖ్య పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చినా నారాయణమూర్తి ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు.

ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితం గడపటానికి నారాయణమూర్తి ప్రాధాన్యత ఇస్తారు.అయితే కొంతమంది నారాయణమూర్తి సాధారణ జీవితం గడిపినా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.పబ్లిసిటీ కోసం ఆయన ఆటోలలో తిరుగుతారని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

అయితే తనపై వచ్చే నెగిటివ్ కామెంట్ల గురించి ఒక సందర్భంలో నారాయణమూర్తి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Telugu Yana Murthy, Auto Rickshaw, Yanamurthy, Orei Rickshaw-Movie

నాకు ఆటోలలో తిరిగితేనే సంతోషంగా ఉంటుందని ఈ లైఫ్ స్టైల్ ను నేను ఇష్టపడతానని నారాయణమూర్తి వెల్లడించారు.నేను నడుచుకుంటూ వెళ్లటం నాకు ఆనందం అని అందుకే అలా చేస్తానని నారాయణమూర్తి పేర్కొన్నారు.

Telugu Yana Murthy, Auto Rickshaw, Yanamurthy, Orei Rickshaw-Movie

నా సినిమాలలో నాకు ఇష్టమైన సినిమా అర్ధరాత్రి స్వతంత్రం అని ఆయన తేలిపారు.గురువుగారు డైరెక్ట్ చేసిన ఒరేయ్ రిక్షా అంటే కూడా చాలా ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు.పాటలలో ఏ పాట ఇష్టమనే ప్రశ్నకు అన్ని పాటలు ఇష్టమని నారాయణమూర్తి కామెంట్లు చేశారు.ఎర్రజెండా ఎర్రజెండా పాట వల్ల పిల్లలు సైతం నన్ను ఎర్రజెండా అంకుల్ అని పిలిచేవారని నారాయణమూర్తి పేర్కొన్నారు.

నారాయణమూర్తి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నారాయణ మూర్తిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube