పబ్లిసిటీ కోసమే ఆటోల్లో తిరుగుతారట.. కామెంట్లకు నారాయణమూర్తి జవాబిదే!

ఆర్.నారాయణమూర్తి గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

డబ్బు కంటే విలువలకు ప్రాధాన్యత ఇచ్చే అతికొద్ది మంది నటులలో నారాయణమూర్తి ఒకరని చెప్పవచ్చు.

ఇండస్ట్రీలో నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా నారాయణమూర్తి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

రైతు కుటుంబంలో జన్మించిన నారాయణమూర్తి హీరో కావాలనే ఆశయంతో సినిమాల్లోకి వచ్చారు.కమర్షియల్ సినిమాలలో ముఖ్య పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చినా నారాయణమూర్తి ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు.

ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితం గడపటానికి నారాయణమూర్తి ప్రాధాన్యత ఇస్తారు.అయితే కొంతమంది నారాయణమూర్తి సాధారణ జీవితం గడిపినా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

పబ్లిసిటీ కోసం ఆయన ఆటోలలో తిరుగుతారని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.అయితే తనపై వచ్చే నెగిటివ్ కామెంట్ల గురించి ఒక సందర్భంలో నారాయణమూర్తి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

"""/"/ నాకు ఆటోలలో తిరిగితేనే సంతోషంగా ఉంటుందని ఈ లైఫ్ స్టైల్ ను నేను ఇష్టపడతానని నారాయణమూర్తి వెల్లడించారు.

నేను నడుచుకుంటూ వెళ్లటం నాకు ఆనందం అని అందుకే అలా చేస్తానని నారాయణమూర్తి పేర్కొన్నారు.

"""/"/ నా సినిమాలలో నాకు ఇష్టమైన సినిమా అర్ధరాత్రి స్వతంత్రం అని ఆయన తేలిపారు.

గురువుగారు డైరెక్ట్ చేసిన ఒరేయ్ రిక్షా అంటే కూడా చాలా ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు.

పాటలలో ఏ పాట ఇష్టమనే ప్రశ్నకు అన్ని పాటలు ఇష్టమని నారాయణమూర్తి కామెంట్లు చేశారు.

ఎర్రజెండా ఎర్రజెండా పాట వల్ల పిల్లలు సైతం నన్ను ఎర్రజెండా అంకుల్ అని పిలిచేవారని నారాయణమూర్తి పేర్కొన్నారు.

నారాయణమూర్తి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

నారాయణ మూర్తిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

డైరెక్టర్ శంకర్ భవిష్యత్తును డిసైడ్ చేయనున్న ఇండియన్3 మూవీ.. ఏం జరిగిందంటే?