జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నందు ఈ రోజు జిల్లా ఎస్పీ డా వినీత్ జి ఐపిఎస్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరిపి ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చేలా,నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ ఎప్పటికప్పుడు కేసులు పురోగతిని పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.అనంతరం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో పెండింగ్ లో ఉన్న కేసుల ఫైళ్లను స్వయంగా పరిశీలించారు.
పొక్సో కేసులలో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడే విధంగా వీలైనంత త్వరగా విచారణ జరిపి కోర్టు వారికి సంబంధిత పత్రాలను సమర్పించాలని కోరారు.భద్రాచలం వద్ద గోదావరి వరదల నేపద్యంలో జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది పనితీరు ప్రశంసనీయం అన్నారు.
స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు,గణేష్ నిమజ్జనోత్సవాలలో కూడా జిల్లాలోని అధికారులు మరియు సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వర్తించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా పని చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు.5S అమలులో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.సైబర్ నేరాలపై జిల్లా ప్రజలకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.గంజాయి,గుట్కా,మట్కా,డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను సరఫరా చేసే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నేరాల అదుపునకు మరియు నేరాల ఛేదన ఆవశ్యకతను వివరిస్తూ నేనుసైతం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు.దొంగతనం కేసులలో నేరస్తులను ప్రస్తుతం పోలీస్ శాఖలో ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పట్టుకుని సొత్తును రికవరీ చేసి భాదితులకు న్యాయం చేకూరేలా కృషి చేయాలని కోరారు.
అనంతరం వర్టికల్స్ విధులలో భాగంగా ప్రతిభ కనబరిచిన అధికారులకు,సిబ్బందికి ఎస్పీ తమ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేసారు.
ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్, కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వరబాబు,ఇల్లందు డిఎస్పీ రమణమూర్తి,డీసీఆర్బీ డిఎస్పీ నందీరామ్,డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఉపేందర్,షీ టీం ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మరియు జిల్లాలోని అందరు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గోన్నారు.