పుష్ప1 సమయానికి పుష్ప2 సమయానికి మారిన పరిస్థితులివే.. కుంభస్థలం బద్దలుగొడతారా?

2021లో పుష్ప సినిమా( Pushpa ) విడుదల విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన ఈ సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి చూస్తుండగానే మూడేళ్లు గడిచిపోయింది.కాలం గిర్రున తిరిగిపోయింది.పుష్ప-1, పుష్ప-2 మధ్య కళ్లముందే మూడేళ్లు గ్యాప్ వచ్చేసింది.ఈ మూడేళ్లలో సినిమాపై అంచనాలు పెరిగాయే తప్ప అస్సలు తగ్గలేదు.

అదే టైమ్ లో పరిస్థితులు కూడా మారాయి.పుష్ప 1 విడుదలైనప్పుడు సినిమాపై ఉన్న అంచనాలు వేరు.

Pushpa 1 Vs Pushpa 2 Lot Of Challenges To Allu Arjun Details, Pushpa 1, Pushpa 2

అల వైకుంఠపురములో లాంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత పుష్ప 1 వచ్చింది.ఆ అంచనాల్ని అది ఈజీగానే అందుకుంది.ఇంకా చెప్పాలంటే, అంతకుమించిన ఘనత సాధించిందని చెప్పాలి.

Advertisement
Pushpa 1 Vs Pushpa 2 Lot Of Challenges To Allu Arjun Details, Pushpa 1, Pushpa 2

అదే ఇప్పుడు పుష్ప 2కు( Pushpa 2 ) కాస్త ఇబ్బందికరంగా మారింది.దేశవ్యాప్తంగా పెరిగిపోయిన అంచనాల్ని పుష్ప 2 అందుకోవాల్సి ఉంది.

అన్ని భాషల ప్రేక్షకుల్ని ఈ సినిమా సంతృప్తి పరచాల్సి ఉంది.మరీ ముఖ్యంగా జాతీయ అవార్డ్( National Award ) అందుకున్న తర్వాత బన్నీ నుంచి వస్తున్న సినిమా కావడంతో పుష్ప2పై ఎక్స్ ట్రా లగేజీ పడినట్టు అయ్యింది.

అలాగే బిజినెస్ పరంగా కూడా పరిస్థితులు బాగా మారిపోయాయి.

Pushpa 1 Vs Pushpa 2 Lot Of Challenges To Allu Arjun Details, Pushpa 1, Pushpa 2

పుష్ప1 సినిమా రిలీజ్ టైమ్ కు బన్నీ( Bunny ) పాన్ ఇండియా స్టార్ కాదు.అప్పుడు అతడి ఆలోచనలు వేరు, టార్గెట్స్ వేరు.వాటిని అతడు ఈజీగానే అందుకున్నాడు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

కానీ పుష్ప 2 బిజినెస్ చూస్తుంటే మతిపోతోంది.ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేసింది ఈ సినిమా.

Advertisement

ఇకపోతే తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే.ట్యాక్సులు, కమీషన్లు, అద్దెలు, కరెంట్ బిల్లులు పోను 215 కోట్ల రూపాయల షేర్ సాధించాల్సి ఉంది.

అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు ఎంతగా మారిపోయాయో చెప్పడానికి ఈ 215 కోట్లు అనే నంబర్ సరిపోతుంది.అల్లు అర్జున్ కి వ్యతిరేకత కూడా పెరిగిందని చెప్పాలి.

ప్రస్తుతం మెగా అభిమానులకు( Mega Fans ) అల్లు అర్జున్ కు అంతగా పడటం లేదు.దీంతో ఇది కూడా కాస్త మైనస్ అయ్యేలా కనిపిస్తోంది.

మరి ఈ సినిమా వీటన్నింటినీ దాటుకుని అనుకున్న విజయాన్ని సాధిస్తుందో లేదో తెలియాలి అంటే మరొక ఐదు రోజులు వేచి చూడాల్సిందే మరి.

తాజా వార్తలు