అలీ ఇచ్చిన నెక్లెస్ కారణంగానే నేను సక్సెస్ అయ్యాను.. పూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో పూరి జగన్నాథ్( Puri jagannath ) ఒకరు.

ఈయన డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారు.

ఈయన డైరెక్షన్లో చేసినటువంటి ప్రతి ఒక్క హీరో కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.ఇలా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ప్రతి ఒక్క టాలీవుడ్ హీరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే ఇటీవల కాలంలో పూరి జగన్నాథ్ సినిమాలపై కాస్త ఫోకస్ తగ్గించారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే పెద్దగా సక్సెస్ అందుకోలేక పోతున్నారు.

ఇటీవల లైగర్ ( Liger ) అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి పూరి జగన్నాథ్ భారీ డిజాస్టర్ ఎదుర్కొన్నారు.అయితే ఈ సినిమాకు ఈయన కూడా నిర్మాత కావడం గమనార్హం.

Advertisement

అయితే గతంలో కూడా ఇలా ఈయన వరుస సినిమాలో డిజాస్టర్ కావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అనంతరం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్యాకప్ అయినటువంటి పూరి జగన్నాథ్ మరోసారి లైగర్ సినిమా ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇకపోతే పూరి జగన్నాథ్ కి సంబంధించినటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో భాగంగా ఈయన ఆలీతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలియజేశారు.ఆలీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చాలా సినిమాలలో నటించడంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది.

అయితే మా ఇద్దరి స్నేహబంధం లో ఓ సంఘటన జరిగిందని నేను తిరిగి సక్సెస్ అయ్యాను అంటే అలీనే కారణం అంటూ పూరి జగన్నాథ్ తెలియజేశారు.సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉంది తినడానికి కూడా సరిగా లేని సమయంలో ఎంతో ఇబ్బందులు పడ్డాను చివరికి అన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని పూరి తెలిపారు.

ఇలాంటి సమయంలో అలీ( Ali ) గారు నాకు ఒక పెద్ద నెక్లెస్( Necklase ) ఇచ్చారు.దాని విలువ కొన్ని లక్షలు ఉంటుంది ఇది నువ్వు వేసుకో నీ కష్టాలన్నీ పోతాయి అంటూ నాకు ఒక మాట చెప్పారు కానీ అంత పెద్ద నెక్లెస్ నేనెలా వేసుకొని తిరగగలను అంతేకాకుండా నాకు దేవుడు అంటే నమ్మకం లేదు సెంటిమెంట్స్ అంటే నమ్మకం లేదు అందుకే ఆలీ గారు ఇచ్చినటువంటి ఆ నెక్లెస్ తీసుకొని మా భార్యకు ఇచ్చి వేసుకోమని చెప్పాను.నాకు దేవుడు అంటే నమ్మకం లేదు కానీ అలి అంటే నమ్మకం ఉందని ఆ నెక్లెస్ నాకు ఇవ్వడంతో ఆయన చెప్పిన విధంగానే నాకు తిరిగి సక్సెస్ వచ్చింది అంటూ ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ ఆలీ గురించి వారిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement
https://www.facebook.com/reel/335552472539723

తాజా వార్తలు