నేను వాళ్ళను మాత్రమే మోసం చేశాను... మీడియాకు లేఖ రాసిన పూరి జగన్నాథ్!

డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

ఈయన పాన్ ఇండియా స్థాయిలో చేసిన లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూటర్లు తమ డబ్బు తమకు వెనక్కి చెల్లించాలంటూ పెద్ద ఎత్తున ఈయనపై ఒత్తిడి తీసుకురావడంతో ఈ విషయం కాస్త వివాదంగా మారింది.

ఈ క్రమంలోనే కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈయనను బెదిరించడం ఈయన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.ఇకపోతే తాజాగా అభిమానులను ఉద్దేశిస్తూ పూరి జగన్నాథ్ మీడియాకు రాసినటువంటి ఒక లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా ఈయన లేఖ రాస్తూ.జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్ ఈ రెండు పూర్తిగా వ్యతిరేకం అనుకుంటాం కానీ ఇవి రెండు మన జీవితంలో ఫ్లో అవుతూ ఉంటాయి ఒకసారి సక్సెస్ అవుతే మరోసారి ఫెయిల్యూర్ తప్పకుండా వస్తుంది.

మనం గట్టిగా ఊపిరి పీల్చుకుంటాం తిరిగి చేయాల్సిన పని వదిలేయటం.పడతాం లేస్తాం నవ్వుతాం తర్వాత ఏడుస్తాం ఇవన్నీ మన జీవితంలో సర్వసాధారణంగా జరిగేవి.

Advertisement

ఇక్కడ ఏది పర్మినెంట్ కాదు అంటూ ఈయన జీవితంలో వచ్చే సక్సెస్ ఫెయిల్యూర్స్ గురించి పెద్ద ఎత్తున లేఖ రాస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

మనం ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా.ఎవరిని మోసం చేయకుండా మన పని మనం చూసుకుంటూ వెళ్తే మనల్ని పీకే వాళ్ళు ఎవరూ లేరు.నేను నా జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా మోసం దగా చేశాను అంటే అది కేవలం ప్రేక్షకులను మాత్రమే.

వారు నా సినిమాపై నమ్మకం పెట్టుకుని టికెట్ కొని సినిమాకు వచ్చారు.ఆ సినిమా డిజాస్టర్ అయింది అంటే నేను ప్రేక్షకులను మాత్రమే మోసం చేసినట్టు.ఈ విషయంలో వారి పట్ల నేను బాధ్యత వహించి మరొక సినిమా తీసి వారిని ఎంటర్టైన్ చేస్తాను.

ఇక డబ్బు విషయానికి వస్తే చచ్చిన తర్వాత ఒక్క రూపాయి వెంట తీసుకువెళ్లాడు అనే వారి పేరు నాకు చెప్పండి నేను కూడా డబ్బును పోగు చేస్తాను.చివరికి మనమందరం కలిసేది స్మశానంలోనే ఈ మధ్యలో జరిగేదంతా ఒక డ్రామా మాత్రమే.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

మీ పూరి జగన్నాథ్ అంటూ పెద్ద ఎత్తున మీడియాకు లేఖ రాయడంతో ఈ లేఖ కాస్త వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు