లైగర్ కోసం పూరీ తన అలవాటుని పూర్తిగా పక్కన పెట్టాడు

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మేకింగ్ స్టైల్, విజన్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే.ఏదైనా ఒక సినిమా అనుకున్నాడు అంటే కేవలం మూడు నెలల్లో సినిమాని పూర్తి చేసి థియేటర్ లో రిలీజ్ చేసేస్తాడు.

 Puri Jagannadh Change His Vision For Liger Movie, Tollywood, Telugu Cinema, Pan-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న దర్శకులలో చాలా వేగంగా సినిమాని తీసే వ్యక్తిగా పూరీకి మంచి పేరు ఉంది.ఎంత పెద్ద స్టార్ హీరో అయిన తనకున్న విజన్ లోనే పూరీ షూటింగ్ ప్లాన్ చేసుకొని ఫినిష్ చేసేస్తాడు.

తక్కువ టైంలో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన కూడా ముందుగానే పక్కా స్క్రిప్ట్ వర్క్ చేసుకొని, లొకేషన్ కి వెళ్తాడు.అనవసరమైన షాట్స్ అంటూ టైం వేస్ట్ చేయకుండా కంప్లీట్ మేకింగ్ విజన్ తో తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేయగాలుగుతున్నాడని ఇండస్ట్రీలో ఉన్న టాక్.

అందుకే పూరీ సినిమాలకి ముందుగా ఎంత బడ్జెట్ అనుకుంటే అంతలోనే కంప్లీట్ అయిపోతుంది.ఒక్క రూపాయి కూడా ఎక్కువ కాదని నిర్మాతల నుంచి వినిపించే మాట.తక్కువ సమయంలో సినిమాలు తీయడం వలన ఈ జెనరేషన్ లో 50 సినిమాల క్రెడిట్ ని చాలా వేగంగా పూరీ సాధించగలిగాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు.

పాన్ ఇండియా రేంజ్ లో తన స్టైల్ లో ఉండే యాక్షన్, మాఫియా కాన్సెప్ట్ తోనే ఈ సినిమాని కూడా పూరీ తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తూ ఉండటంతో పూరీ తన అలవాటుని పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమా షూటింగ్ కోసం మొదటి సారి చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నాడు.ఇప్పటి వరకు కేవలం 60 శాతం మాత్రమే షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా మూవీ కావడం, అది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం, విజయ్ దేవరకొండ మార్కెట్ కి మించి ఖర్చు పెడుతూ ఉండటం వలన ఈ సినిమా విషయంలో పెర్ఫెక్షన్, కేలిక్యులేషన్ మిస్ కాకూడదని పూరీ షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఏది ఏమైనా, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ తో మూడు నెలల్లో సినిమా చేసి సూపర్ హిట్స్ కొట్టిన పూరీ లైగర్ విషయంలో మాత్రం తన విజన్ ని పక్కన పెట్టాడంటే ఆలోచించాల్సిన విషయమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube