సుడిగాలితో కుక్క పిల్ల ఆటలు.. వీడియో వైరల్

అమెరికా ప్రజలకు తరచూ టోర్నడోలతో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.అందుకే అక్కడి వారు ఎక్కువగా చెక్కతో చేసిన ఇళ్లలో నివసిస్తుంటారు.

ఏ మాత్రం టోర్నడోలు వచ్చి ఇల్లు ధ్వంసమైనా తిరిగి నిర్మించుకోవడం సులభం అవుతుంది.అంతేకాకుండా ప్రాణనష్టం కూడా తక్కువ ఉంటుంది.

ఈ నేపథ్యంలో చెక్క ఇళ్లకే అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.ఇక తరచూ టోర్నడోలు బాగా విజృంభించి, అక్కడ ఆస్తి, ప్రాణనష్టాలకు దారి తీస్తుంటాయి.

దీంతో టోర్నడోలు వచ్చాయంటేనే అక్కడి ప్రజలు బాగా ఆందోళన చెందుతారు.అయితే ప్రతి సారీ అక్కడ భారీ టోర్నడోలు రావు.

Advertisement

చిన్న స్థాయి టోర్నడోలు కూడా వస్తుంటాయి.వాటి వల్ల ఏ మాత్రం నష్టం ఉండదు.

ఇలాంటి ఓ టోర్నడోతో అక్కడి ఓ కుక్క పిల్ల ఆడుకోవడం బాగా వైరల్ అయింది.దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఇటీవల అమెరికాలోని ఓ ప్రాంతంలో చిన్న టోర్నడో వచ్చింది.అది ఏ మాత్రం హాని కలిగించేంత స్థాయి కాదు.

అదే పెద్ద స్థాయి టోర్నడో అయితే మనుషులు ఎగిరిపోవడమే కాదు.ఏకంగా ఇల్లు కూడా ధ్వంసం అవుతాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అయితే రోడ్డుపై వచ్చిన ఓ టోర్నడోతో ఓ చిన్ని బుజ్జి కుక్క పిల్ల ఆడుకుంది.అందులోకి వెళ్లి కాళ్లు పెట్టడం, మళ్లీ వెనక్కి రావడం వంటి పనులు చేసింది.

Advertisement

ఆ పనులు చూసిన ఎవరికైనా నవ్వు వస్తుంది.అయితే దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్‌లో పెట్టాడు.

ఇక ఆ బుజ్జి కుక్క పిల్ల ఏకంగా ఆ టోర్నడోనే ఆపేసిందని ఆ వ్యక్తి క్యాప్షన్ పెట్టాడు.అమెరికాలో టోర్నడోలను ఆపిన సూపర్ హీరో అని పేర్కొన్నాడు.

దీనికి నెటిజన్లు కూడా విభిన్నంగా స్పందిస్తున్నారు.టోర్నడోను నిజంగానే ఆపేసిందని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం నెట్టింట ఆ బుజ్జికుక్క పిల్ల వీడియో బాగా వైరల్ అయింది.

తాజా వార్తలు