అమెరికాలో ( America ) ఎప్పుడు ఎవరిని చంపుతారో, దేనితో దాడి చేస్తారో చెప్పలని పరిస్థితి.అమెరికా వెళ్ళిన ఎంతోమంది భారతీయులు ఏ పాపం చేయకుండానే కొందరు సైకోల చేతుల్లో మరణించారు.
తాజాగా ఒక ప్రముఖ సెలబ్రిటీపై కూడా ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు.అమెరికాలో గుర్తుతెలియని ఒక వ్యక్తి పాపులర్ పంజాబీ యాక్టర్ అమన్ ధలివాల్‌ని( Aman Dhaliwal ) కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.
అమన్ తెలుగు వారికి కూడా సుపరిచితుడే.మహేష్ బాబు హీరోగా వచ్చిన ఖలేజా మూవీలో జాన్ పాత్రను అమన్ పోషించాడు.
గురువారం ఉదయం కాలిఫోర్నియాలోని ప్లానెట్ ఫిట్‌నెస్ జిమ్‌లో( Fitness Gym ) ఈ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది.వర్కౌట్స్ చేసేందుకు వెళ్లిన అమన్ పై అతడు కత్తితో దాడి చేయడం మొదలుపెట్టగానే అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు.కొందరు మాత్రం తీవ్ర గాయాలపాలైన నటుడిని సమీపంలోని హాస్పిటల్‌కి హుటాహుటిన తరలించారు.దుండగుడు అమన్ పై దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.
ఛాతీ, మెడ, తల, భుజం తదితర భాగాలపై గాయాలైనట్లు వైద్యులు చెబుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి వైరల్ అయిన వీడియోలో నిందితుడు గట్టిగ కేకలు వేయడం వినొచ్చు వాటర్ కావాలని తనకు గౌరవం ఇవ్వాలని అతను అమన్‌ను పట్టుకొని అరిచాడు.సమయంలో అతడు అమన్‌ను గట్టిగా పట్టుకున్నాడు.తర్వాత అతడి నుంచి తప్పించుకునేందుకు అమన్ ప్రయత్నించగా ఆ శ్వేత జాతీయుడు కత్తితో విచక్షణారహితంగా కోశాడు.
అప్రమత్తమైన జిమ్ సిబ్బంది అక్కడికి వచ్చి నేలపై పడుకోబెట్టారు.అప్పటికే అమన్ చాలా గాయాల పాలయ్యాడు అతని ఒంటినిండా, తల నుంచి రక్తం కారడం మొదలైంది.
ఈ దృశ్యాలన్నీ ఒళ్ళు గగర్పొడిచేలా చేశాయి.ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది.