ప్లే ఆఫ్ రేసులో నిలిచిన పంజాబ్ .. కోహ్లీసేనకి మరో ఓటమి !

ఐపీఎల్ 2020 లో మళ్లీ విజయం ఎలా ఉంటుందో రుచి చూసింది.ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వరుస ఓటములతో ఢీలా పడ్డ కింగ్స్‌ పంజాబ్ ‌కు గేల్‌ మంచి ఇన్నింగ్స్ ‌తో ఆకట్టుకున్నాడు.తన మార్కు స్టైల్‌ ఆటతో పంజాబ్‌ కి చాలా రోజుల తర్వాత ఓ విజయాన్ని అందించాడు.మొదట నెమ్మదిగా ఆడిన గేల్‌ తర్వాత సిక్స్‌లతో మంచి జోష్‌ తీసుకొచ్చాడు.45 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లతో 53 పరుగులు సాధించిన గేల్‌ తన విలువ ఏమిటో చూపించాడు.అతనికి జతగా కేఎల్‌ రాహుల్‌(61 నాటౌట్‌; 49 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లు) మరోసారి రాణించడంతో కింగ్స్‌ పంజాబ్‌ విజయం సాధించింది.

కింగ్స్‌పంజాబ్‌ జట్టులో మయాంక్‌ అగర్వాల్ ‌(45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్‌ చేసి మంచి ఆరంభాన్నిచ్చాడు.ఆ తర్వాత గేల్‌, రాహుల్ ‌లు స్క్రోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు.

కాగా, చహల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది.ఆ ఓవర్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు రెండు పరుగులు అవసరం కాగా, చహల్‌ తొలి నాలుగు బంతులకు పరుగు మాత్రమే ఇచ్చాడు.

Advertisement

ఇక ఐదో బంతికి గేల్‌ రనౌట్‌ అయ్యాడు.దాంతో ఉత్కంఠ ఏర్పడింది.

కానీ పూరన్‌ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ఫినిష్‌ చేయడంతో కింగ్స్‌ పంజాబ్‌కు విజయం దక్కింది.ఈ సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ కింగ్స్‌ పంజాబ్‌ దే పైచేయి అయ్యింది.

ఇది పంజాబ్‌ కు రెండో విజయం కాగా, ఆర్సీబీకి మూడో ఓటమి.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు