ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పంజాబ్ అభివృద్ధిపై దృష్టిపెట్టారు భగవంత్ మాన్.ఇప్పటికే అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
దీనిలో భాగంగా పంజాబ్ పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేసేందుకు గాను సీఎం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.సెప్టెంబర్ 11 నుంచి 18 వరకు భగవంత్ మాన్ జర్మనీలో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా అక్కడి వ్యాపార ప్రతినిధులు, కంపెనీల అధిపతులు, ఎన్ఆర్ఐలతో సీఎం సమావేశమవుతారు.పునరుత్పాదక ఇంధనం, కార్ల తయారీ, ఫార్మాస్యూటికల్స్, అడ్వాన్స్ అగ్రికల్చర్ విధానాలు, ఇతర కీలక రంగాలలో పంజాబ్‌కు పెట్టుబడులు ఆకర్షించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పర్యటనలో మ్యూనిచ్, ఫ్రాంక్‌ఫర్ట్, బెర్లిన్‌లలో బస చేయనున్న భగవంత్ మాన్ బీఎండబ్ల్యూ, BayWa వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులత్ భేటీ అవుతారు.
పంజాబ్‌ను పారిశ్రామిక హబ్‌గా మార్చందుకు కట్టుబడి వున్నామని సీఎం పునరుద్ఘాటించారు.
ఇందుకోసం అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టేది లేదన్నారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు.
తన జర్మనీ పర్యటన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుందని భగవంత్ మాన్ ఆకాంక్షించారు.జర్మనీలోని పారిశ్రామికవేత్తలకు తాను వ్యక్తిగతంగా పంజాబ్‌లోని అవకాశాలను, వృద్ధికి సంబంధించిన వివరాలను వివరిస్తానని సీఎం తెలిపారు.
దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పెట్టుబడి గమ్యస్థానంగా పంజాబ్ ఇప్పటికే నిలిచిందన్న ఆయన.రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.పంజాబ్ పారిశ్రామిక వృద్ధికి తన పర్యటన కీలక మైలురాయిగా నిలుస్తుందని భగవంత్ మాన్ ఆకాంక్షించారు.

ఇకపోతే.ఎన్ఆర్ఐల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా ఫీల్డ్ ఆఫీసర్‌లను నోడల్ అధికారులుగా నియమించాలని సీఎం భగవంత్ మాన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.
సహాయ కమీషనర్ (గ్రీవెన్స్)కు సమాన సంఖ్యలో వున్న పోస్టులను రద్దు చేసి ‘‘ముఖ్యమంత్రి ఫీల్డ్ ఆఫీసర్‌ల’’ పేరిట 23 పోస్టులను ఏర్పాటు చేశారు.పారదర్శకమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అందించడం వల్ల జిల్లా స్థాయిలోనే పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
సీఎం కార్యాలయంతో నేరుగా కమ్యూనికేట్ చేయడంతో పాటు శాఖలు, జిల్లాల వారీగా సమన్వయం చేయగల ఈ అధికారులు .ఎన్ఆర్ఐలకు ఆదర్శ నోడల్ అధికారులుగా పేరు తెచ్చుకుంటారని భగవంత్ మాన్ ఆకాంక్షించారు.ఈ ఏర్పాటు ద్వారా ఎన్ఆర్ఐలు.తమ సమస్యలన్నింటికీ సజావుగా, అవాంతరాలు లేని రీతిలో పరిష్కారాలను పొందుతారని భగవంత్ మాన్ అన్నారు.







