కెనడాలో భారతీయ యువకుడు మృతి.. 23 రోజుల తర్వాత స్వగ్రామానికి మృతదేహం, అంత్యక్రియలు పూర్తి

ఈ నెల 4న కెనడాలో( Canada ) గుండెపోటుతో మరణించిన భారతీయ యువకుడు హర్బేజ్ సింగ్ (31)( Harbhej Singh ) మృతదేహం దాదాపు 23 రోజుల తర్వాత పంజాబ్‌ రాష్ట్రం తర్న్ తరైన్ జిల్లాలోని స్వగ్రామానికి చేరుకుంది.

అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు , గ్రామస్తుల కన్నీటి వీడ్కోలు మధ్య అతని అంత్యక్రియలు ముగిశాయి.

ఆదివారం రాత్రి హర్బేజ్ భౌతికకాయం రాజసాన్సీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.ఈ సందర్భంగా రైతు నాయకుడు దియాల్ సింగ్( Dial Singh ) మాట్లాడుతూ.

ప్రభుత్వంపై మండిపడ్డారు.రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పంజాబ్ ప్రభుత్వం విఫలమైందని, దీంతో ఉపాధిని వెతుక్కుంటూ యువత విదేశాలకు వలస వెళ్లాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హర్బేజ్ సింగ్‌కు త్వరలో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా.ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

ఎనిమిదేళ్ల క్రితం తన పాఠశాల విద్య ముగిసిన తర్వాత హర్బేజ్ దుబాయ్‌కి( Dubai ) వెళ్లిపోయాడు.అక్కడ డ్రైవర్‌గా( Driver ) కొన్నాళ్లు ఉద్యోగం చేసిన ఆయన.కొన్ని నెలల క్రితమే కెనడాకు వెళ్లాడు.హర్బేజ్ సింగ్ తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకునేందుకు క్యూలో వుండగా.

ఛాతీలో ఒక్కసారిగా నొప్పి రావడంతో కుప్పకూలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.హర్బేజ్ మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా గ్రామస్తులు సైతం విషాదంలో మునిగిపోయారు.

నాటి నుంచి చట్టపరమైన లాంఛనాలు, ఇతర కార్యక్రమాలు ముగిసి అతని మృతదేహం భారత్‌కు రావడానికి 23 రోజులు పట్టింది.

ఇకపోతే.గత నెలలోనూ పంజాబ్‌కు చెందిన ఓ యువకుడు కెనడాలో ఇలాగే గుండెపోటుతో( Heart Attack ) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.మృతుడిని హోషియార్‌పూర్‌కు చెందిన జస్వంత్ సింగ్ బజ్వా కుమారుడు కరణ్‌వీర్ సింగ్ బజ్వా (23)గా( Karanveer Singh Bajwa ) గుర్తించారు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

ఆయన మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.కరణ్‌వీర్ తన చదువు కోసం నాలుగేళ్ల క్రితం కెనడా వెళ్లాడని మృతుడి బంధువు సత్పాల్ సింగ్ బజ్వా వెల్లడించారు.

Advertisement

తన కుమారుడితో పాటు తన తమ్ముడి కొడుకులు కూడా కెనడాలోనే వున్నారని సత్పాల్ చెప్పారు.నాలుగేళ్ల విద్యాభ్యాసం తర్వాత కరణ్‌వీర్ .పీఆర్ (శాశ్వత నివాస హోదా) కోసం పత్రాలను సమర్పించాడు.

కరణ్‌వీర్ రాత్రి తన గదిలో ఎప్పటిలాగే పడుకున్నాడని.కానీ ఉదయం ఎంతకీ లేవలేదని బంధువులు తెలిపారు.అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.

కరణ్‌వీర్ మరణవార్తను కుటుంబ సభ్యులకు తెలియజేశారు.పోస్ట్‌మార్టం అనంతరం అతని మృతదేహాన్ని భారత్‌కు తరలించనున్నారు.

కరణ్‌వీర్ సింగ్ తండ్రి జస్వంత్ సింగ్ పంజాబ్ పోలీస్ విజిలెన్స్ విభాగంలో పనిచేసేవారు.అయితే 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జస్వంత్ ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో కరణ్‌వీర్, అతని సోదరి బాగోగులను బంధువులు చూసుకున్నారు.

తాజా వార్తలు