ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో సెలబ్రిటీగా మారిపోయిన శిరీష ( sirisha )అలియాస్ బర్రెలక్క పేరు సోషల్ మీడియాలో అనూహ్యంగా మద్దతు లభిస్తోంది.చాలామంది సొంత ఖర్చులతో ఆమె తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రధాన పార్టీలైన బీ ఆర్ ఎస్, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బర్రెలక్క ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ గెలుపు తనదేనన్న ధీమాలో ఉన్నారు.నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం( Kolhapur Constituency ) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
అనేకమంది సెలబ్రిటీలు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు.మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ( Former IPS officer Lakshminarayana )సైతం స్వయంగా సంపూర్ణ మద్దతు తెలిపి బర్రెలక్క ను గెలిపించాలని కోరారు.
అనూహ్యంగా వస్తున్న క్రేజ్ , ఊహించని విధంగా వస్తున్న ప్రముఖుల మద్దతుతో గెలుపు తనదేనన్న ధీమాలో బర్రెలక్క ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా కొల్లాపూర్ నియోజక వర్గంలో తన గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
” నేను నామినేషన్ వేసి వచ్చినప్పటికీ చాలా భయపడ్డాను.నాకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి.మనలాంటి వాళ్ళు ఎన్నికల్లో నిలబడితే ఇలా భయపెట్టేస్తారా ? అన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే , నేను గెలుస్తానని వాళ్ళ భయం. పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి మన జీవితాలను నాశనం చేయబోతుందని వాళ్లకు భయమేస్తుంది.నేను చాలా నిరుపేద రాలిని.నామినేషన్ వేయడానికి కొంత అప్పు తీసుకు వచ్చాను.ఎందుకంటే పేద అమ్మాయిని మీరంతా ఆదరిస్తారని నమ్మకం ఉంది.ఓటుకి డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు.
కానీ నేను గెలిస్తే మీకు అన్ని పనులు చేసి పెడతాను.
మీరు విజిల్ గుర్తుకు ఓటెయ్యండి చాలు.అభివృద్ధి ఎందుకు రాదో నేను చూస్తాను.నేనే కాదు మిమ్మల్ని అందరిని అసెంబ్లీకి తీసుకొని వెళ్తాను.
మనకి కావాల్సినవి మనమే తెచ్చుకుందాం.ఎక్కడా వైద్యం, విద్య , రోడ్లు సరిగా లేవు.
నేను గెలిస్తే ఇవన్నీ చేస్తాను. నేను తాత కెసిఆర్ ( KCR )తో పోరాడాలంటే మీరు నన్ను గెలిపియ్యాలి.ఈ రోడ్లు సరిగా లేవు మీరు ఎవరిని అడగలేదా ? మీరు దేనికీ భయపడవద్దు .25 సంవత్సరాల అమ్మాయిని నేను 70 ఏళ్ల వారిని గడగడలాడిస్తున్నా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.