చనిపోయిన తర్వాత ఆ రికార్డును సొంతం చేసుకున్న పునీత్.. ఏమైందంటే?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి 45 రోజులైంది.పునీత్ మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులను సైతం ఎంతగానో బాధపెట్టింది.

తన నటనతో పునీత్ రాజ్ కుమార్ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నా సేవా కార్యక్రమాలతో పునీత్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.సంపాదించిన మొత్తంలో కోట్ల రూపాయలను సేవా కార్యక్రమాల కోసమే పునీత్ రాజ్ కుమార్ ఖర్చు చేశారు.

ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా పునీత్ చనిపోయే వరకు ఆ సేవా కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకొని లబ్ధి పొందాలని అనుకోలేదు.అందరితో స్నేహపూర్వకంగా మెలితే పునీత్ రాజ్ కుమార్ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులలో పునీత్ రాజ్ కుమార్ కూడా ఒకరు కావడం గమనార్హం.చిన్నవయస్సులోనే కార్డియాక్ అరెస్ట్ వల్ల పునీత్ రాజ్ కుమార్ చనిపోయారు.

Advertisement

పునీత్ మరణ వార్త విని కన్నడ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల పునీత్ అభిమానులు సైతం షాక్ కు గురయ్యారు.

పునీత్ రాజ్ కుమార్ చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని కన్నడ ప్రభుత్వం ఆయనకు బసవ శ్రీ పురస్కారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సంవత్సరం గూగుల్ టాప్ సెర్చ్ జాబితాలో పునీత్ రాజ్ కుమార్ కూడా ఉండటం గమనార్హం.

వికీపీడీయాలో ఈ సంవత్సరం ఎక్కువమంది వెతికిన వ్యక్తులలో పునీత్ రాజ్ కుమార్ ఒకరిగా నిలిచారు.పునీత్ చనిపోయిన తర్వాత ఆయన గురించి  తెలుసుకోవడానికి ఎక్కువమంది వికీపీడియాలో వెతికారు.గూగుల్ లో సెర్చ్ జాబితాలో పునీత్ టాప్ ప్లేస్ లో ఉండటం కొందరు అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నా మరి కొందరు మాత్రం ఎమోషనల్ అవుతున్నారు.

పునీత్ భౌతికంగా మరణించినా తమ హృదయాల్లో మాత్రం జీవించి ఉన్నారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?
Advertisement

తాజా వార్తలు