పంచ్ ప్రసాద్ కు తీవ్ర అనారోగ్యం.. ఫోన్ పే నంబర్ ద్వారా చికిత్సకు సహాయం చేయాలని కోరుతూ?

Punch Prasad Health Condition Critical Needs Financial Help Details, Punch Prasad, Comedian Punch Prasad, Punch Prasad Kideny Failure, Punch Prasad Health, Jabardast Comedian, Nookaraju, Kidney Transplantation, Help Punch Prasad, Punch Prasad Phonepe

జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన పంచ్ ప్రసాద్( Punch Prasad ) గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారనే సంగతి తెలిసిందే.పంచ్ ప్రసాద్ జబర్దస్త్ షోలో( Jabardasth ) అడపాదడపా కనిపిస్తున్నా ఈ షోలో స్కిట్లు చేయడానికి కూడా పంచ్ ప్రసాద్ ఎంతగానో కష్టపడుతున్నారు.

 Punch Prasad Health Condition Critical Needs Financial Help Details, Punch Prasa-TeluguStop.com

పంచ్ ప్రసాద్ కు ఇప్పటికే పలువురు జబర్దస్ కమెడియన్లు తమ వంతు సహాయం చేశారు.అయితే పంచ్ ప్రసాద్ ఆరోగ్య స్థితిని, ఆర్థిక కష్టాలను తెలియజేస్తూ నూకరాజు ఒక వీడియోను షేర్ చేశారు.

అన్ని పరీక్షలు చేయించామని అయితే అన్నకు ఇంకా క్యూర్ కాలేదని నూకరాజు( Nookaraju ) తెలిపారు.మూడేళ్ల క్రితమే అన్నకు రెండు కిడ్నీలు ఫెయిల్( Kidney Failure ) అయ్యాయని నూకరాజు అన్నారు.

అన్నకు రెండు రోజులకు ఒకసారి డయాలసిస్ చేయిస్తున్నరని ఆ డయాలసిస్ కు ఎక్కువ మొత్తం ఖర్చవుతోందని నూకరాజు పేర్కొన్నారు.పంచ్ ప్రసాద్ అన్నకు సీరియస్ గా ఉందని ఆయన కామెంట్లు చేశారు.

పంచ్ ప్రసాద్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించాలని లేదంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో చెప్పలేమని నూకరాజు చెప్పుకొచ్చారు.కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు 20 లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఆయన కామెంట్లు చేశారు.మా తరపున మేము కొంత మొత్తం ఇచ్చామని మీరు ఎంతో కొంత సాయం చేస్తే అన్నకు హెల్ప్ అవుతుందని నూకరాజు చెప్పుకొచ్చారు.

ఫోన్ పే నంబర్, అకౌంట్ నంబర్ ఇస్తామని పంచ్ ప్రసాద్ కు సహాయం చేస్తే బాగుంటుందని నూకరాజు కామెంట్లు చేశారు.రూపాయి అయినా సహాయం చేయాలని నూకరాజు కోరారు.ప్రసాద్ అన్నను మనందరం కాపాడుకోవాలని నూకరాజు తెలిపారు.

సహాయం చేయలేని వాళ్లు స్టేటస్ లో పెట్టి ఇతరులకు ఈ సమాచారం తెలిసేలా చేయాలని నూకరాజు అన్నారు.ప్రసాద్ గారు తొందరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Punch Prasad Health Condition Critical Needs Financial Help Details, Punch Prasad, Comedian Punch Prasad, Punch Prasad Kideny Failure, Punch Prasad Health, Jabardast Comedian, Nookaraju, Kidney Transplantation, Help Punch Prasad, Punch Prasad Phonepe - Telugu Punch Prasad, Jabardast, Kidney, Nookaraju, Punchprasad #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube