పంచ్ ప్రసాద్ కు తీవ్ర అనారోగ్యం.. ఫోన్ పే నంబర్ ద్వారా చికిత్సకు సహాయం చేయాలని కోరుతూ?

జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన పంచ్ ప్రసాద్( Punch Prasad ) గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారనే సంగతి తెలిసిందే.

పంచ్ ప్రసాద్ జబర్దస్త్ షోలో( Jabardasth ) అడపాదడపా కనిపిస్తున్నా ఈ షోలో స్కిట్లు చేయడానికి కూడా పంచ్ ప్రసాద్ ఎంతగానో కష్టపడుతున్నారు.

పంచ్ ప్రసాద్ కు ఇప్పటికే పలువురు జబర్దస్ కమెడియన్లు తమ వంతు సహాయం చేశారు.

అయితే పంచ్ ప్రసాద్ ఆరోగ్య స్థితిని, ఆర్థిక కష్టాలను తెలియజేస్తూ నూకరాజు ఒక వీడియోను షేర్ చేశారు.

అన్ని పరీక్షలు చేయించామని అయితే అన్నకు ఇంకా క్యూర్ కాలేదని నూకరాజు( Nookaraju ) తెలిపారు.

మూడేళ్ల క్రితమే అన్నకు రెండు కిడ్నీలు ఫెయిల్( Kidney Failure ) అయ్యాయని నూకరాజు అన్నారు.

అన్నకు రెండు రోజులకు ఒకసారి డయాలసిస్ చేయిస్తున్నరని ఆ డయాలసిస్ కు ఎక్కువ మొత్తం ఖర్చవుతోందని నూకరాజు పేర్కొన్నారు.

పంచ్ ప్రసాద్ అన్నకు సీరియస్ గా ఉందని ఆయన కామెంట్లు చేశారు. """/" / పంచ్ ప్రసాద్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించాలని లేదంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో చెప్పలేమని నూకరాజు చెప్పుకొచ్చారు.

కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు 20 లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఆయన కామెంట్లు చేశారు.

మా తరపున మేము కొంత మొత్తం ఇచ్చామని మీరు ఎంతో కొంత సాయం చేస్తే అన్నకు హెల్ప్ అవుతుందని నూకరాజు చెప్పుకొచ్చారు.

"""/" / ఫోన్ పే నంబర్, అకౌంట్ నంబర్ ఇస్తామని పంచ్ ప్రసాద్ కు సహాయం చేస్తే బాగుంటుందని నూకరాజు కామెంట్లు చేశారు.

రూపాయి అయినా సహాయం చేయాలని నూకరాజు కోరారు.ప్రసాద్ అన్నను మనందరం కాపాడుకోవాలని నూకరాజు తెలిపారు.

సహాయం చేయలేని వాళ్లు స్టేటస్ లో పెట్టి ఇతరులకు ఈ సమాచారం తెలిసేలా చేయాలని నూకరాజు అన్నారు.

ప్రసాద్ గారు తొందరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పిఠాపురంలో పవన్ గెలవడం కష్టం.. వంగా గీతాన్ని ఎవరు ఓడించలేరు: శ్యామల