కడప కింగ్.ఏమయ్యింది ఆ పౌరుషం.
లక్షల ఓట్లు మెజారిటీ వచ్చిన ఇలాఖాలో జగన్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది అంటున్నారు విశ్లేషకులు.తనకి తోడుగా ఉంటారు అనుకున్న బలమైన నేతలని మెల్ల మెల్లగా సైకిల్ ఎక్కి పోతుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో జగన్ ఉన్నాడట.
ఎక్కో పక్క జిల్లాల్లో వైసీపి నేతలు టిడిపిలోకి వెళ్ళారంటే అనుకోవచ్చు కానీ సొంత జిల్లా అది కూడా పులివెందులలో వైసీపి నేతలు టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు అంటే ఎంతో ఘోరమైన అవమానం అనే చెప్పాలి.
పులివెందుల పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.
వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట.అక్కడ ఆ ఫ్యామిలీలో వారు చెప్పింది జరుగుతుంది.
వారి మాట కాదని ఎవ్వరు ఏమి చేయరు.అయితే వైఎస్ మరణం తరువాత జగన్ ఇప్పుడు ఆ హుందా తనాన్ని ఆ పెద్దరికాన్ని అక్కడ చేయలేక పోతున్నారు.
ఒంటెద్దు పోకడలతో వెళ్ళడం.కేడర్ ని పట్టించుకోక పోవడం జగన్ కి ఉన్న ప్రధానమైన సమస్య.
ఇప్పుడు అదే కొంప ముంచుతోంది.ఏమంటూ పాదయాత్ర మొదలు పెట్టాడో గానీ.
ముఖ్యనేతలు అంటా సైకిల్ ఎక్కేస్తునారు.అయితే తాజాగా పులివెందుల నేతలు టిడిపి పార్టీ లోకి జంప్ అవ్వడంతో ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం అవుతోంది.
పులివెందులలో కొందరు ముఖ్య నేతలు మరియు శ్రీకాకుళానికి చెందినా మరికొంతమంది నేతలు అందరు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి వెళ్ళారు.ఈ వ్యవహారాన్ని నడిపించింది అంతా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర మంత్రి అయిన కళా వెంకట్రావు.
అయితే సైకిల్ ఎక్కిన నేతలు టిడిపి లో అభివృద్ధి చూసి మేము వెళ్ళాము.చంద్రబాబు పాలన మాకు ఎంతో నచ్చింది అని తెలిపారు.కళా వెంకట్రావు మాట్లాడుతూ జగన్ కి వైసీపి ని నడిపించే సత్తా లేదనే విషయం మా పార్టీలోకి వస్తున్న వైసీపి నేతలని చూస్తేనే అర్థం అవుతోందని అన్నారు.జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా సరే తానూ అనుకున్న సీఎం పదవిని పొందలేరు.
ముందు మీ పార్టీని కాపాడుకోండి అంటూ విమర్శించారు.